తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎల్పీ స్టేడియడంలో జరగనుంది . తొలి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నందున గ్రాండ్ గా… అందరి సమక్షంలోనే చేసుకోవాలని రేవంత్ రెడ్డి డిసైడయ్యారు. అందుకే ఏఐసీసీ అగ్రనేతలందర్నీ పిలిచారు. కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలకు చెందిన వారిని పిలిచారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల్ని తన స్నేహితుల్ని కూడా పిలిచారు. ఈ జాబితాలో కేసీఆర్, కేటీఆర్, జగన్ రెడ్డి, చంద్రబాబు కూడా ఉన్నరు. ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియాంక హాజరవుతున్నారు.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా హాజరు అవుతారు. కేసీఆర్ ను దిగిపోతున్న ముఖ్యమంత్రి హోదాలో ఆహ్వానించడం కామన్. అయితే ఇంత వరకూ కేసీఆర్ రేవంత్ రెడ్డికి కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్పలేదు. ఆయన ప్రమాణస్వీకారానికి హాజరవుతారన్న గ్యారంటీ లేదు. జగన్ రెడ్డి కి కూడా ఆహ్వానం పంపారు. కానీ హాజరైతే.. కాంగ్రెస్ కూటమికి దగ్గరవుతున్నారని బీజేపీ అనుకుంటుంది అదే జరిగితే కష్టాలొస్తాయి కాబట్టి జగన్ రెడ్డి హాజరు కాకపోవచ్చు. తన తరపున ఎవరినైనా పంపొచ్చని భావిస్తన్నారు.
చంద్రబాబునాయుడు కూడా ఇంత వరకూ విషెష్ చెప్పలేదు. ఆయన కూడా హాజరవడం కష్టమే. అయితే టీడీపీలో ఉండగా రేవంత్ తో స్నేహంగా ఉన్న టీడీపీ యువనేతలు మాత్రం హాజరయ్యే అవకాశం ఉంది. సినీ ప్రముఖుల్ని కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఎవరెవరు వస్తారన్నది రేపు తేలుతుంది.. మరో వైపు తాను నెల రోజులక్రితం హామీ ఇచ్చిన రజనీ అనే దివ్యాంగురాలిని కూడా రేవంత్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.