జన్వాడలో ఫామ్‌హౌస్ ఖచ్చితంగా కేటీఆర్‌దేనని… రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ అక్కడ ఉంటున్నారని గతంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లను చూపించారు. గతంలో..జన్వాడలో కేటీఆర్‌కు ఫామ్‌హౌస్ ఉందని మీడియాను తీసుకెళ్లినప్పుడు… రేవంత్ కొన్ని డ్రోన్ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. అనుమతి లేకుండా డ్రోన్‌తో షూట్ చేసిన కేసులో పోలీసులు రేవంత్‌ను అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయనకు బెయిల్ దక్కలేదు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్.. ఆ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నానని… రేవంత్ డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం వల్ల రక్షణ లేకుండా పోయిందని కేటీఆర్ చెప్పినట్లుగా పోలీసులు కోర్టుకు చెప్పారు. దీన్నే రేవంత్ రెడ్డి బయట పెట్టారు.
ఆ ఫామ్‌హౌస్ లీజుకు తీసుకున్నామని గతంలో.. టీఆర్ఎస్ నేతలు చెప్పారని.. ఇప్పుడు సంబంధం లేదంటున్నారని..రేవంత్ మండిపడ్డారు. ముమ్మాటికి.. 111 జీవో ఉల్లంఘించి కేటీఆర్ అక్రమ నిర్మాణం చేపట్టారని రేవంత్ స్పష్టం చేశారు. అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్ కూడా ట్వీట్ చేశారని గుర్తు చేశారు. జన్వాడ ఫాంహౌస్ 301 నుంచి 313 సర్వే నెంబర్లలో విస్తరించి ఉందని .. 301 సర్వే నెంబర్లలో కేటీఆర్ సతీమణి పేరిట 3 ఎకరాలు భూమి ఉందని రేవంత్ ప్రకటించారు. భూములు లేవని కేటీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు…తనే జీవో 111లో అక్రమ నిర్మాణాలు కట్టినట్లుగా ఆరోపించారని… భూములున్న మాట వాస్తవమే కానీ..అందులో ఎలాంటి అక్రమ నిర్మాణాలున్నా.. కూల్చివేతకు సిద్ధమని…మీరు సిద్ధమా అని సవాల్ చేశారు.
కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి..లేదంటే బర్తరఫ్ చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఇష్యూని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పెద్దది చేసుకుంటూ వెళ్తున్నారు. టీఆర్ఎస్ నేతలు..కూడా రేవంత్‌కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్ ఆ కౌంటర్లను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీంతో ఈ ఫామ్‌హౌస్ వ్యవహారం ఎటు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది.