కేసీఆర్ సర్కార్ నియమించిన ఏడుగురు సలహాదారుల సేవలకు.. రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ బై చెప్పింది . ఒకే ఉత్తర్వలతో అందరి పదవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జగన్ రెడ్డిలా ప్రతి దానికి సలహాదారుల్ని కేసీఆర్ నియమించుకోలేదు. ఏపీలో వంద మంది వరకూ.. నెలకు మూడు లక్షల వరకూ జీతాలు తీసుకునే సలహాదారులు ఉన్నారు. అందులో ఒక్కరంటే ఒక్కరూ సలహాలు ఇవ్వరు. వారికి రాజకీయ పదవులు, ప్రజాధనం దోచి పెట్టడానికి ఇచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్.. .ఏుడగుర్నే నియమించుకున్నారు. వారు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా రిటైరన వారు.. ఇతర ఉన్నతాధికారులే.
ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న రాజీవ్ శర్మ, పోలీస్, లా అండ్ ఆర్డర్, క్రిమినల్ కంట్రోల్ సలహాదారుగా ఉన్న అనురాగ్ శర్మ, మైనార్టీ వెల్ఫెర్ సలహాదారుగా ఉన్న ఏకే ఖాన్, ఆర్థిక సలహాదారుగా ఉన్న జీ.ఆర్ రెడ్డి, ఫారెస్ట్ వ్యవహారలలో సలహాదారుగా ఉన్న ఆర్.శోభా, సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరించిన సోమేశ్ కుమార్, వ్యవసాయ వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో చెన్నమనేని రమేష్ కు ఇటీవల టిక్కెట్ ఇవ్వని కారణంగా బుజ్జగించడానికి పదవి ఇచ్చారు. మిగతా వారంగా డీజీపీలుగా.. సీఎస్‌లుగా చేసి పదవి విరమణ పొందిన వారే.
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోవడంతో ఆ ప్రభుత్వం నియమించిన వారిలో ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు కె.వి రమణాచారి, ట్రాన్స్ కో, జెన్ కో సలహాదారు దేవులపల్లి ప్రభాకర్ రావు తమ పదువులకు ఇప్పటికే రాజీనామా చేశారు. వీరితో పాటు మరికొందరు కార్పొరేషన్ చైర్మన్లు సైతం రాజీనామా చేశారు. వీరు చేయకపోవంతో వీరిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.