తెలంగాణ కొత్త అసెంబ్లీ తొలి సమావేశాల్లో గత ప్రభుత్వంపై న్యాయవిచారణలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలపై బీఆర్ఎస్ నేతల కోరిక మేరకే విచారణలకు ఆదేశిస్తున్నామని రేవంత్ ప్రకటించేశారు. నిజంగానే బీఆర్ఎస్ నేతలు విచారణకు సవాల్ చేశారు. అదే అదనుగా విచారణ ప్రకటించేశారు రేంత్ రెడ్డి.
గడచిన పదేండ్లలో విద్యుత్ వ్యవస్థల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఒప్పందాలు, ప్రభుత్వ పనితీరుపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసనసభలో ప్రకటించారు. మూడు అంశాల ప్రాతిపదికగా ఈ విచారణ జరిపిస్తామన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలు, ఒప్పందాలపై విచారణ జరుగుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా తీరుతెన్నుల సమీక్ష కోసం అఖిలపక్షంతో నిజనిర్థారణ కమిటీ నియమిస్తామన్నారు. దీనికి కారణమం.. విచారణ చేయించుకోవాలని మాజీ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ చేయడమే.
మేడిగడ్డ కుంగుబాటుపై శాసనమండలిలో చర్చ జరుగుతున్న సమయంలో కవిత .. విచారణ చేసుకోవాలని సవాల్ చేయడంతో సభలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఇప్పుడు వీటిపై విచారణల్లో ఏమి తెలుతాయో కానీ..తాము కక్ష సాధింపులకు పాల్పడలేదని.. వారే విచారణకు డిమాండ్ చేసినందున తాము విచారణ చేయించమని వాదించే అవకాశం ఉంది. అందులో ఏది బయటపడుతుందన్న సంగతి తర్వాత విషయం.