హైదరాబాద్ అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మూసి ప్రాజెక్టు, ఫోర్త్ సిటీ అంశాల్లో పూర్తి ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులపై విపక్తాలు ఆరోపణలు చేస్తున్నాయంటేనే.. ఆ ఐడియాలు గొప్పగా ఉన్నాయని ఆయన ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ముచ్చర్ల వద్ద నిర్మించతలపెట్టిన ఫోర్త్ సిటీ విషయంలో రేవంత్ మరింత పర్టిక్యులర్ గా ఉన్నారు. అమెరికా పర్యటనలో ఈ సిటీ గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. పెట్టుబడులను ఆ సిటీలో పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. ల
ముచ్చర్ల వద్ద ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా అభివృద్ధఇ చేసున్నామని అత్యాధునిక హంగులతో కాలుష్యానికి, ట్రాఫిక్ సమస్యల్లేకుండా ఈ సిటీ నిర్మించబోతున్నట్టు వారికి ప్రజంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడున్న మూడు సిటీల్లో భారీగా కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నందున చాలా కంపెనీలు రావడానికి ఇబ్బంది ఎదురవుతోంది. అందుకే నాల్గో సిటీని తెరపైకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు పరిచయం చేస్తున్నారు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌తోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొంటున్నారు. మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విభాగాలు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని వారికి హామీ ఇస్తున్నారు.
Read Also: రేవంత్ Vs కేటీఆర్- పెట్టుబడుల అంశంలోనూ రాజకీయమే!
అమెరికాలో సీఎం రేవంత్ ఫార్మా, బయోటెక్, ఐటీ, టెక్నాలజీ, షిప్పింగ్, ఈవీ రంగాలకు చెందిన కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ప్రతి చోటా ప్యూచర్ సిటీలో పెట్టుబడులు, వివిద పారిశ్రామికవేత్తల అవసరాలు, వారి సూచనలు, ప్రభుత్వ ఆలోచనలతో సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఒక్క హైదరాబాద్ కాకుండా తెలంగాణలోని చాలా జిల్లాలు పారిశ్రామిక ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయని వాటిని క్లస్టర్లుగా విభజించి ప్రగతిపథంలోకి తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు.
రేవంత్ రెడ్డి పట్టుదలగా ప్రయత్నిస్తే.. ఫోర్త్ సిటీకి చాలా వేగంగా ఓ రూపం వస్తుంది. సైబరాబాద్‌కు ఆలోచనే కీలకం. చంద్రబాబు ఐటీ పరిశ్రమల్ని ప్రోత్సహించారు. అక్కడ అంతా ప్రైవేటు పెట్టుబడులే. మౌలిక సదుపాయాలు మాత్రమే ప్రభుత్వం కల్పించింది. ఫ్యూచర్ సిటీలోనూ అంతే. రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకా .. సిటీ ప్లాన్ ను.. డిసైడ్ చేసుకుని మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రారంభిస్తే.. ఐదేళ్లలో ప్రజల ముందు ఓ ప్రణాళిక అయినా ఉంటుంది. అప్పుడు హైదరాబాద్ మరో వైపు కొత్త సిటీ ఆవిష్కృతం అయినట్లు అవుతుంది.