కవిత అరెస్టును ఖండించాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె ఆరెస్టు కుట్ర ప్రకారమే జరిగిందన్నారు. అయితే రేవంత్ ఉద్దేశంలో ఆ కుట్ర బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకూ కేసీఆర్ కవిత అరెస్టుపై స్పందించలేదని తెలంగాణ పర్యటనలో ఉన్న మోదీ కూడా.. కవిత అరెస్టుపై స్పందించలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. వంద రోజుల పాలనపై మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కవిత అరెస్టుపై స్పందించారు.
ఈడీ, సీబీఐ మోదీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అనిస్పష్టం చేశారు. కవిత విషయంలో కేసీఅర్ కే ఒక విధానపరమైన నిర్ణయం లేదన్నారు. ఎన్నికల ముందు ఈ డ్రామాలు తెలంగాణ సమాజం గమనించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు నాటకం ఆడుతున్నారని.. కవిత పై తండ్రిగా కేసీఅర్ కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కనీసం మోదీ కూడా దీనిపై స్పందించలేదని గుర్తు చేశారు. కేసీఅర్, మోదీ మౌనం వెనక మతలబు ఎంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు.
కవితను ఎక్కడ అరెస్టు చేస్తారో అని కాంగ్రెస్ నేతలు కూడా కంగారు పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఇలాంటివి బీఆర్ఎస్ పై సానుభూతి పెంచుతాయనే ఆందోళన ఆ పార్టీలో కనిపించింది. నిజానికి కవితను అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరెస్టు చేసి.. బండి సంజయ్ నే అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే.. ఈ రోజ బీజేపీ .. కాంగ్రెస్ కన్నా మెరుగైన పొజిషన్ లో ఉండేదన్న అభిప్రాయం ఉంది. చివరికి .. కవిత అరెస్టు ను కాంగ్రెస్ కూడా ఖండిస్తోంది. బీజేపీ అసలు మాకేమి సంబంధమని.. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఎవరు చేయమన్నారని అంటోంది.