ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కొత్త వ్యవస్థలను తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది..? వాటిని అడ్డుపెట్టుకొని నకిలీగాళ్ళు , ఇంకొంతమంది అవినీతి అధికారులు చేతివాటం ప్రదర్శించడం ఎప్పుడు జరిగే తంతే. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల సంగతి తేల్చేందుకు ఇటీవల తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాను క్యాష్ చేసుకునేందుకు వసూలు బ్యాచ్ రంగంలోకి దిగిపోయింది.
హైదరాబాద్ లో హైడ్రా పేరు చెబితే.. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుడుతోంది. ఎప్పుడు వస్తారో.. ఏ సమయంలో కూల్చివేతలు షురూ చేస్తారోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డు పెట్టుకొని కొంతమంది అధికారులు డబ్బులు అడుగుతున్న విషయం ప్రభుత్వం వద్దకు చేరింది.
హైడ్రా పేరు చెప్పి కొంతమంది అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమయాకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల రెవెన్యూ , మున్సిపల్ , ఇరిగేషన్ అధికారులపై కూడా ఫిర్యాదులు అందాయని చెప్పారు. అక్రమంగా ఎవరైనా డబ్బులు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన రేవంత్ రెడ్డి..వసూళ్ళ బ్యాచ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.