కాంగ్రెస్ పార్టీ సీనియర్లను రేవంత్ రెడ్డి టీజ్ చేస్తున్నారు. తాను చేస్తున్న పాదయాత్రకు అద్భుత స్పందన వస్తూండటం.. ఇతరులకు కనీసం తన నియోజకవర్గాల్లో కూడా పలుకుబడి లేని పరిస్థితి ఉండటంతో రేవంత్ దూకుడు మీద ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి స్పందన లేక ఆపేశారు. ఆదిలాబాద్ నుంచి భట్టి విక్రమార్క యాత్ర ప్రారంభించారు. కానీ అది సాగుతుందా అనే సందేహం మొదటి రోజే ప్రారంభమయింది. జన స్పందన అంతంతమాత్రంగా ఉంది. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రేవంత్ రెడ్డి తానే అభ్యర్థినని పాదయాత్రలో మీడియా ప్రతినిధులతో పరోక్షంగా చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని… తానే సీఎం అభ్యర్థి అన్న విషయలంలో క్లారిటీగా ఉన్నానని చెబుతున్నారు. తాను పొలిటికల్ ఎంట్రీ నుంచి క్లారిటీగా ఉన్నానని అందుకే ఎమ్మెల్యే అయ్యాను అప్పుడు క్లారిటీగా ఉన్నాను. ఆ తర్వాత ఎంపీ అయ్యాను. టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాను ఇప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉన్నానని రేవంత్ చెప్పుకొచ్చారు. అంటే సీఎం అవుతాననే దానిపైన తాను క్లారిగా ఉన్నాను అనే దాన్ని చెప్పకనే చెబుతున్నారు రేవంత్ రెడ్డి.
మరోసారి కొడంగల్ నుంచి పోటీ చేయడానికి రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. రెండు సార్లు అక్కడ్నుంచి గెలిచినా గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో వరుసగా ఏ పార్టీకి 3 సార్లు అధికారం ప్రజలు ఇవ్వలేదని ఈ సారి బీఆర్ఎస్కు కూడా ఇవ్వరన్న నమ్మకంతో ఉన్నారు. రేవంత్ వ్యాఖ్యలు సహజంగానే సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తాయి..కానీ రేవంత్ ఈ మాటలను మీడియాతో పిచ్చాపాటిగా అంటున్నారు. అందుకే వారు ఎవరికీ ఫిర్యాదు చేయలేని పరిస్థితి.