టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఏదీ సులువుగా లభించడం లేదు. టీ పీసీసీ చీఫ్ వచ్చిన తర్వాత ఓ సీక్వెన్స్‌లో పార్టీకి ఊపు తెద్దామనుకున్నారు. రెండు అడుగులు వేసేసరికి.. కేసీఆర్ బీజేపీని అయినా అంగీకరిస్తాను కానీ కాంగ్రెస్‌ను కాదని … రాజకీయం మార్చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కౌంటర్ వ్యూహం అమలు చేయాల్సి ఉంది. దీని కోసం రేవంత్ రెడ్డి ముందుగా … పార్టీలో కోవర్టుల్ని ఏరి వేసే ప్రయత్నం చేస్తున్నారు. పై స్థాయి నేతల విషయంలో ఏం చేయలేకపోతున్నా.. కింది స్థాయి మొత్తం తన చేతుల్లోనే ఉంది కాబట్టి ఆ దిశగా ప్రక్షాళన సిద్ధం చేస్తున్నారు.
దాదాపు 15 జిల్లాల అధ్యక్షులను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్లక్ష్యంగా ఉండటం, అసంతృప్తి నేతలతో అంటకాగడం వంటి వారిపై వేటు వేయనున్నారు. తాను పదవి చేపట్టిన తర్వాత పలు సార్లు అన్ని జిల్లాల అధ్యక్షులకు పార్టీ నే ఫైనల్‌గా పని చేయాలని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కొంతమంది నేతలు వాటిని పట్టించుకోలేదు. అలాంటి వారిని జిల్లా అధ్యక్షుల స్థానం నుంచి మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెండు రోజులుగా గాంధీభవన్‌లో ఒక్కో జిల్లా అధ్యక్షుడితో విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీలో అసంతృప్తి నేతలు, వారితో జిల్లా అధ్యక్షులకు ఉన్న సంబంధాలపై కూడా రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. పార్టీలో ఆయా సందర్భాల్లో వ్యతిరేకస్వరం వినిపించడం, నేతలపై దాడులు చేయడం, పార్టీ సమావేశాల్లో వ్యతిరేక నినాదాలు చేయడం, రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ తర్వాత ఆ వర్గంతో సయోధ్యగా లేకుండా ఇతర పార్టీల నేతలతో కుమ్మక్కవడం చేసిన నేతల్ని గుర్తించారు. వారిని రేపోమాపో మార్చే అవకాశాలు కనిపిస్తున్ాయి.