జన్వాడ కేటీఆర్ ఫామ్‌హౌస్ కేంద్రంగా తెలంగాణ రాజకీయం రాజుకుంటోంది. కేటీఆర్ ఫామ్‌హౌస్‌పై రేవంత్ రెడ్డి ఎన్జీటీకి ఫిర్యాదు చేయడంతో.. అక్కడి నుంచి నోటీసులు వచ్చాయి. విచారణ కమిటీని నియమించారు. ఈ పరిణామంతో తెలంగాణ కాంగ్రెస్ నేత రేవవంత్ రెడ్డి మరింత దూకుడుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను వినిపిస్తున్నారు. రేవంత్‌కు సరైన కౌంటర్ ఇవ్వాల్సిందేనని డిసైడైన టీఆర్ఎస్ నేతలు.. మీడియా ముందుకు వచ్చారు. రేవంత్‌పై రివర్స్ ఆరోపణలు చేశారు. 111 నెంబర్ జీవో పరిధిలో కేటీఆర్‌కు ఫామ్‌హౌస్ లేదని..రేవంత్ రెడ్డికే ఉందని.. పత్రాలు విడుదల చేశారు.
రేవంత్, ఆయన బంధువుల పేర్ల మీద ఉన్న భూముల వివరాలను వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద బంగళా కట్టారని ఎమ్మెల్యే సుమన్ ఫోటో విడుదల చేశారు. సుమన్ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని మరో నేత కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. జీవో 111 పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎవరెవరికి ఎన్నెన్ని భూములు బంగళాలు ఉన్నాయో బయటపెడతామని చాలెంజ్ చేశారు. వీరి ప్రెస్‌మీట్ ఇలా ముగియగానే అటు రేవంత్ రెడ్డి.. మరో ట్వీట్ చేశారు. ముందుంది ముసళ్ల పండగ..అని టీజ్ చేసే ప్రయత్నం చేశారు.
సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటలకు మరిన్ని వివరాలు బయటపెడతానన్నట్లుగా ఆయన టైం ప్రకటించారు. ఆట్వీట్‌ను కేటీఆర్‌కు.. తెలంగాణ సీఎంవోకు ట్యాగ్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి మళ్లీ ఏం బయట పెడతారోనన్న చర్చ ప్రారంభమయింది. కేటీఆర్‌కు ..జన్వాడ ఫామ్‌హౌస్‌కు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అది కేటీఆర్‌దేనని నిరూపించే పత్రాలనురేవంత్ బయటపెడతారేమోనన్న చర్చలు జరుగుతున్నాయి.