తెలంగాణ రాజకీయాల్లో నాయకుల కోసం వాస్తు మార్పులు, చేర్పులు అనే వార్త వినిపిస్తూనే ఉంటుంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సచివాలయం, ప్రగతి భవన్ ఇలా ప్రతి చోట వాస్తులో మార్పులు చేర్పులు ఉండేవి. ఇటీవల ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ ఎంట్రీ, ఎగ్జిట్ లో వాస్తు మార్పులు చేశారు.
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. పీసీసీ అధ్యక్ష పదవి రాగానే గాంధీ భవన్ లో వాస్తుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసిన రేవంత్ రెడ్డి… సచివాలయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు.
ముఖ్యంగా సీఎం ఇప్పటి వరకు మెయిన్ గేట్ నుండి సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఇక నుండి వెస్ట్ గేట్ నుండి సీఎం కాన్వాయ్ ఎంట్రీ ఉంటుంది. నార్త్ ఈస్ట్ గేట్ నుండి ఎగ్జిట్ ఉండబోతుంది. ఇక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సౌత్ గేట్ నుండి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు దీనిపై కసరత్తు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.