సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుండి మరో సంచలన ప్రకటన. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తీస్తానని ప్రకటించాడు వర్మ.
దీనిపై ఓ ఉపోద్ఘాతం కూడా రాశాడు వర్మ. ”తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలత్తెకునేలా చేసింది ఎన్టీఆర్ అనబడే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు,మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అని రాయప్రోలు గారంటే, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్లలో కేవలం ఒకడిగా ప్రపంచంలో వున్న ప్రతి తెలుగువాడికి చెప్పేది ..ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ ని.” ఇలా సాగింది వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటన.
వర్మ నుండి ఇలాంటి ప్రకటనలు రావడం కొత్తేం కాదు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ పై మాత్రం ఆయన చేసిన తొలి ప్రకటన ఇదే. టాలీవుడ్ కు బై చెప్పి ముంబాయ్ వెళ్ళిపోయిన వర్మ.. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మళ్ళీ టాలీవుడ్ సర్కిక్స్ కాస్త హల్ చల్ సృస్టించాడు. అయితే వర్మ వ్యవహారం తెలిసిన వారెవరూ ఈ ప్రకటన ను అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇలా ప్రకటనలకే పరిమితం అయిపోయిన సినిమాలు ఆయన కెరీర్ లో డజన్లలో వుంటాయి. మరి ఈ ప్రకటన ఏమౌతుందో..