“లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను సెన్సార్ బోర్డ్ నిలిపివేయడంతో.. సోషల్ మీడియాలో ఆర్జీవీ… “పెగ్గు” మీద గుగ్గిలమవుతున్నారు. కోర్టుకెళ్తానని సవాల్ చేస్తున్నారు. ఆయన వెళ్తారో లేరో కానీ.. కోర్టుకు వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా.. వచ్చే నెల పదకొండో తేదీ వరకూ.. ఆ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ఆ తర్వాత రిలీజ్ చేసుకోవచ్చని… సెన్సార్ బోర్డు కూడా చెప్పింది. దాంతో.. ఇప్పుడు ఆర్జీవీకి.. మరో దారి లేదు. కాకపోతే.. కావాల్సినంత రచ్చ చేసుకునే అవకాశం ఉంది. కానీ..అసలు షూటింగ్ స్పాట్‌కే వెళ్లని ఆర్జీవీ.. రచ్చ చేయడానికి బయటకు మాత్రం ఎందుకు వస్తారు. ఇంట్లో కూర్చుని వోడ్కా సిప్ చేస్తూ… ట్వీట్లు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేరు. కానీ.. ఇప్పుడు మీడియాకు కూడా.. సోషల్ మీడియాకు కూడా.. ఆర్జీవీ ట్వీట్లు చేస్తే.. తీరిగ్గా కామెంట్లు చేసి.. బ్రేకింగులు వేసి.. వైరల్ చేసేంత తీరిక లేదు. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.
రేపట్నుంచి నామినేషన్ల పర్వం. నామినేషన్ల దాకా వచ్చాకా.. ఇక నాన్సెన్స్ గురించి ఆలోచించే తీరిక ఎవరికీ ఉండదు. చివరికి సోషల్ మీడియాకు కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా.. ఆర్జీవీని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆర్జీవీ సినిమాను నిలిపివేశారని.. ఆర్జీవీ చెబితే తప్ప పెద్దగా బయట ప్రపంచానికి తెలియలేదు. అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందని కూడా ఎవరూ అనుకోలేదు.. కాబట్టి అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఆర్జీవీ టైమింగ్ మిస్సయినట్లు తెలిసిపోతుంది. ఏదైనా ఇలాంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్‌ను..ఎన్నికల కోడ్ రాక ముందే రిలీజ్ చేయాలి. కనీసం.. ఒక్క రోజు ముందు చేసినా.. అడ్డుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కానీ..నేరుగా ఓ పార్టీకి.. ఓ నేత ఇమేజ్ డ్యామేజ్ చేసేలా సినిమా తీసి కోడ్ ఉన్న సమయంలో రిలీజ్ చేద్దామనుకుంటే.. అంత కంటే అమాయకత్వం ఉండదు.
ఈ విషయంలో ఆర్జీవీ నిర్లక్ష్యం చేశారో.. ఆయనకు అవగాహన లేదో కానీ.. సినిమా మాత్రం ఆగిపోయింది. ఇప్పుడు మీడియా … టైం అంతా.. రాజకీయ పార్టీలు నేతలు కొనేసుకుని ఉంటారు. తీరిగ్గా.. ఆర్జీవీ మీద ఇంటర్యూలు పెట్టే సమయం వారికి ఉండకపోవచ్చు. ఇక ఉన్న ఒకే ఒక్క ఆప్షన్.. యూట్యూబ్‌లో రిలీజ్ చేసుకోవడం… దానిపైనా యూ ట్యూబ్‌కు కంప్లైంట్లు వెళితే… బ్లాక్ చేస్తారేమో..? ఆ జాగ్రత్తలైనా వర్మ తీసుకుంటే మంచిదేమో..?