మూడు రోజులుగా మూగబోయిన రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ పిట్ట ఈ రోజు మళ్లీ సౌండ్ చేసింది. ‘ఆఫీసర్’ రిజల్ట్ ఆయన్ను డిజప్పాయింట్ చేసినట్టుంది. ఆ సినిమా విడుదల రోజు నుంచి ట్విట్టర్లో ఆయన కనిపించడం మానేశారు. సాధారణంగా ఇతరుల సినిమాలు బోల్తా కొట్టినప్పుడు సెటైర్స్ వేసే వర్మ, స్వంత సినిమా గురించి విడుదల తరవాత ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. ఈ రోజు రాజకీయ నాయకులపై సెటైర్‌తో సడన్ ట్వీట్ వేశారు. “రాజకీయ నాయకులు నిజం చెప్పే ఒకే ఒక్క సందర్భం ఏది అంటే… అతను మరో రాజకీయ నాయకుడిని అబద్ధాల కోరు అని ఆరోపించేటప్పుడు” – ఇది వర్మ చేసిన ట్వీట్. రాజకీయ నాయకులు అందరూ అబద్ధాలు చెప్పేవారేననే ఉద్దేశం వర్మ ట్వీట్లో వ్యక్తమయ్యింది. అయితే… ఈ ట్వీట్ చేశాక ఆయనపై వ్యతిరేకత కూడా అదే స్థాయిలో వ్యక్తమవుతోంది. ‘ఆఫీసర్’ రిజల్ట్‌పై ఓ రేంజ్ సెటైర్స్ పడుతున్నాయి. అవన్నీ వర్మ పట్టించుకోరు అందుకోండి. అయితే… మూడు రోజుల మౌనం వెనుక కారణం ఏమై వుంటుందో? రిజల్ట్ ఆయన్ని కూడా డిజప్పాయింట్ చేసిందేమో!!