వైసీపీ నేతలు ఎవరైనా పార్టీ వీడిపోతే పోవద్దని బతిమాలుకుంటారేమో కనీ… ఒక్క లీడర్ మాత్రం.. ఎప్పుడు వెళ్తారా అని చూస్తూంటారు. ఆ లీడర్ రోజా. పార్టీ ముఖ్య నేతలు కూడా ఆమె వెళ్లిపోతే బాగుండు అనుకుంటూ ఉంటారని తాడేపల్లి ప్యాలెస్లో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. అంతే వారి కోరిక అంత ఈజీగా నెరవేరేలా లేదని తేలిపోయింది. ఇటలీ పర్యటనలు.. తమిళనాడులో టెంపుల్ రన్ పూర్తయిపోయిన తర్వాత తిరుమలకు వచ్చిన రోజా.. తాను వైసీపీని వీడట్లేదని ప్రకటించారు.
ఆమె ప్రకటన చూసి వైసీపీ లీడర్, క్యాడర్ లో నిరుత్సాహం ఏర్పడింది. ఈ మధ్య సోషల్ మీడియాలో వైసీపీ పేరు, జగన్ బొమ్మ కనిపించకుండా బయో అప్డేట్ చేసుకున్నారు. దీంతో ఆమె పార్టీ మారిపోతున్నారని వైసీపీ నేతలు సంతోషపడ్డారు. కానీ వారి ఆశలు రోజా నీళ్లు చల్లారు. ఏపీలో ఆమెను ఏ రాజకీయ పార్టీ చేర్చుకోలేదు. అందుకే తమిళనాడు రాజకీయాలకు వెళ్తారేమో అనుకున్నారు. అక్కడా అనుకూలంగా లేదేమో కానీ..తనకు వైసీపీ ఉందనుకుంటున్నారు.
నగరిలో ఎప్పుడు పోటీ జరిగినా అతి తక్కువ ఓట్లతోనే విజేత బయటపడతారు. కానీ మొన్నటి ఎన్నికల్లో రోజా వ్యవహారశైలితో ఆ తేడా … నలభై వేల ఓట్లకు వెళ్లింది. ఆమెకు అనుచరవర్గమే లేకుండా పోయింది., అయితే నగరి తప్ప ఆమెకు మరో చోటు లేదు. అందుకే అక్కడే తెలిసిన వాళ్లతో సమావేశాలు నిర్వహించేందుకు సిదధమయ్యారు.