పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు రంగం సిద్దమైయింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ప్రభంజనం సృష్టిస్తుంది. అదే సమయంలో సినిమా ప్రమోషన్స్ ఉదృతంగా నిర్వహిస్తుంది టీం. ఇప్పటికే ముంబాయ్, బెంగళూరులో ఈవెంట్లు పెట్టారు. ఈ రోజు హైదరాబాద్ ప్రెస్ మీట్ నిర్వహించింది టీం. ఈ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, నిర్మాత దానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం పంచుకున్న సినిమా విశేషాలు…
రామ్ చరణ్, తారక్ ని ఒకే ఫ్రేములో మొదటి షాట్ తీసినప్పుడు ఒక దర్శకుడిగా మీరు ఎలా ఫీలయ్యారు ?
చరణ్, తారక్ బైక్ పై వస్తుంటారు. అదే నేను తీసిన మొదటి షాట్. వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరు, డైలాగు చెపుతున్న విధానం విధానం చూసి,… వీళ్ళ మధ్య స్నేహం అద్భుతంగా వర్క్ అవుట్ అవుతుందని మొదటిషాట్ పెట్టినప్పుడే అర్ధమైపోయింది.
తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా చాలా భాషలు వున్నాయి కదా.. డబ్బింగ్ లో ఏ భాష ఇబ్బందిగా అనిపించింది.
తారక్: మలయాళం చెప్పలేదు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ చెప్పా, మలయాళం చెప్పడానికి ప్రయత్నించాం. కానీ ఆ భాషని ఖూనీ చేస్తున్నామని రాజమౌళి గారు భావించి వేరే వాళ్ళత్రో చెప్పించారు.( నవ్వుతూ) మిగతా భాషలు చెప్పినపుడు కష్టం అనిపించలేదు కానీ చాలా ఆనందంగా వుండేది.
రాజమౌళి సినిమా అంటే సమయం, శ్రమ.. రెండూ వుంటాయి. లాక్ డౌన్ కారణంగా సమయం ఇంకా పెరిగిపోయింది. ఇన్ని రోజులు అదే ప్యాషన్, ఎనర్జీని ఎలా కొనసాగించారు?
అలియా భట్: ముందుగా అందరినీ నమస్కారం. ట్రైలర్ పగిలిపోయింది. ముంబాయ్ లో పిచ్చెక్కిపోయింది( తెలుగులో)
రాజమౌళి గారితో సినిమా చేయడం గొప్ప విషయం. మీరుఅన్నట్టు మధ్యలో కరోనా, లాక్ డౌన్ లాంటి అవాంతరాలు వచ్చాయి. అందరం ఇబ్బందులు పడ్డాం. అయితే అవి సినిమా పట్ల ఎలాంటి ప్రభావం చూపించలేదు. మొదటి రోజు ఎలాంటి కసితో సెట్ లోకి వెళ్ళామో చివరి వరకూ అదే పట్టుదల పనిచేశాం.
రామ్ చరణ్: సినిమా చాలా జోష్ తో మొదలుపెట్టాం. మధ్యలో కరోనా లాంటి అడ్డంకులు వచ్చాయి. అయితే ఏ జోష్ తో మొదలుపెట్టామో డానికి డబుల్ జోష్ తో సినిమాని పూర్తి చేశాం. దీనికి కారణం రాజమౌళి గారు. ఆయన సినిమా అంటే మీరంత ఎంత ఇష్టపడతారో తెలుసు. మీ ఇష్టమే ఎనర్జీ ఇచ్చింది.
తారక్: ప్రతి జీవికి ఒక ఆశ వుంటుంది. ఏదో మంచి రోజు వస్తుందని. ఆ ఆశతోనే పని చేశాం. ఆ ఆశలు ఈ రోజు ఫలించాయి.
రాజమౌళి: కరోనా ప్రపంచం మొత్తానికి వచ్చింది. మన చేతుల్లో లేనిది. ప్రకృతి మనకి ప్రశ్న వేసింది, ఎక్కడి పరుగు అని ప్రశ్నించింది. ప్రాణ నష్టం భయం అందరిలోనూ వుంది. అయితే ప్రపంచం మొత్తానికి ఇజ్ ఒక పాజ్ మాత్రమే. స్టాప్ కాదు. మళ్ళీ ప్రపంచం మొదలౌతుందనే నమ్మకం వుంది. ఆ నమ్మకమే ఈ రోజు మీ ముందు వుంచింది.
కొమరం భీమ్ పాత్ర కోసం ఎలా సిద్దమయ్యారు ?
కొమరం భీమ్ గురించి మనఅందరికీ కొంత సమాచారం తెలుసు. అయితే ఆయనలో డెప్త్ ని తెలియజేయడంలో, ఆ పాత్రని అర్ధం చేసుకోవడంలో సహకరించింది రాజమౌళి. కండలు పెంచగలం. అవి బయటికి కనిపిస్తాయి. కానీ కండబలం కంటే గుండెబలం గొప్పది. కొమరం భీమ్ గుండెబలం ఏమిటో రాజమౌళి గారు చెప్పారు. ప్రతి డిటేయిల్ అద్భుతంగా వివరించారు. క్రిడెట్ అంతా రాజమౌళిదే.
రామ్ చరణ్, తారక్ కు అద్భుతమైన ఫ్యాన్, మాస్ ఫాలోయింగ్ వుంది. మరి వారిని తెరపై చూపించినపుడు ఫ్యాన్స్ ని ద్రుష్టిలో పెట్టుకున్నారా ? వారి సమ న్యాయం చేశారా ?
రాజమౌళి: స్టార్ వాల్యు బాగా తెలిసన డైరెక్టర్ ని నేను. స్టార్ వాల్యుతోనే ఈ స్థాయిలోకి వచ్చాను. అయితే స్టార్స్ కేవలం ఆడియన్స్ ని థియేటర్ లోకి మాత్రమే తీసుకురాగలరనే సూత్రాన్ని నమ్ముతాను. రామ్ చరణ్, తారక్ .. ప్రేక్షకులని థియేటర్ వరకూ తీసుకురాగలరు. సినిమా మొదలైన తర్వాత తెరపై వారిద్దరూ రెండు పాత్రలు. ఆ పాత్రలు పండితేనే సినిమా విజయం సాధిస్తుంది. ప్రేక్షకుడి పాత్రనే కనెక్ట్ అవుతాడు తప్పితే స్టార్ తో కాదుని నమ్ముతాను. ప్రేక్షకులు పాత్రలకు రెస్పాండ్ అవుతారు తప్పితే మెగాపవర్ స్టార్, జూ. ఎన్టీఆర్ కి రియాక్ట్ అవ్వరని నమ్మాను. ఆ నమ్మకంతోనే సినిమా తీశాను.
ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి మీలో బెస్ట్ అవుట్ పుట్ రాబట్టుకున్న సన్నివేశం ఏదైనా ఉందా?
రాజమౌళి గారి సినిమా చేయడం హాయిగా ఇన్స్పైరింగా వుంటుంది. ఆయన రాసే విధానం, సీన్ చెప్పినపుడు, సెట్ లో చేసినప్పుడు ఇవన్నీ యునిక్ గా వుంటాయి. ఆయన ఏం అనుకుంటున్నారో దానికి మెంటల్ గా ఫిజికల్ ఉండటానికి ప్రయత్నిస్తే చాలు. ఆయన చెప్పే బాటలో నడిస్తే నటుడిగా మన పని చాలా ఈజీ.
తారక్ : ఒక్క సీన్ అని చెప్పలేము కానీ ఈ సినిమా అంతా ఒక కమిట్మెంట్. ఈ సినిమాకి కేటాయించిన రోజులు తక్కువైన సినిమా గురించి ఆలోచించిన రోజులు ఎక్కువ. మొత్తం సినిమాని ఒక కమిట్మెంట్ గానే చూశాను.
బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ సినిమాలు చేయడానికి ఆసక్తి చేయడానికి ఇష్టపడరు ? ఈ ఆఫర్ వచ్చినపుడు మీకు ఎలా అనిపించింది?
అలియా భట్ : అలా ఏం వుండదు. నేను అయితే ఇలాంటి అభిప్రాయాన్ని వినలేదు. ఎవరైనా సినిమాలు చేయలనే అనుకుంటారు.
రామ్ చరణ్, తారక్ తో చేయడం ఎలా అనిపించింది ?
రామ్ చరణ్, తారక్ అద్భుతమైన నటులు, మంచి మనుషులు. వాళ్ళతో పని చేయడం మంచి అనుభవం. చాలా కేరింగా చూసుకున్నాడు. రాజమౌళి గారితో పని చేయడం ఓకే డ్రీమ్. ఆ డ్రీమ్ ఈ సినిమాతో తీరింది. ఆయనతో ఇంకా పని చేయాలని వుంది.
మీ సినిమాల్లో అద్భుతమైన షాట్స్ వుంటాయి. ఆర్ఆర్ఆర్ ఆ చివరి షాట్ వండర్ ఫుల్. ఇలాంటి థాట్స్ రావడానికి మూలకారణం ?
చాలా థాట్స్ బుర్రలో వుంటాయి. ఎన్ని అయినా అలోచించవచ్చు, కానీ వాటిని స్క్రీన్ పై తీసుకురావాలంటే మాత్రం ఎప్పుడూ భయంగానే వుంటుంది. సరిగా వస్తుందో లేదో అనే టెన్షన్. అందుకే నా టీంకి చాలా ఇబ్బంది పెడుతుంటాను. వాళ్ళు తిట్టుకుంటూ కూడా బాగా వర్క్ చేస్తారు ( నవ్వుతూ) అయితే ఇలాంటి థాట్స్ కి మూలకారణం మాత్రం నేను చిన్నపుడు చదువుకున్న సాహిత్యం.
ట్రైలర్ రెండు షేడ్స్ కనిపిస్తున్నాయి ? ఏమిటా వైవిధ్యం ?
రామ్ చరణ్ : రెండు కాదు సినిమాలో మూడు షేడ్స్ వుంటాయి. మూడు షేడ్స్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. తెరపై మీరే చూస్తారు.
ఆర్ఆర్ఆర్ ప్రిమియర్ షో ఉండబోతుందా ?
ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదు. డిస్టిబ్యుటర్స్ తో మాట్లాడాలి. మా నిర్మాత దానయ్య గారు ఓకే అంటే…
ఏపీలో టికెట్టు విషయంలో సమస్య వుంది ? ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్టీఆర్ సహాయం ఏమైనా తీసుకుంటారా ? ఆయన ఆప్త మిత్రులు ఏపీలో అధికారంలో వున్నారు కదా.. ?
నిర్మాత దానయ్య : ఏపీ టికెట్ ధరలు తగ్గించారు. పెద్ద సినిమాలకు నష్టం తప్పదు. ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం అనుకూలంగా స్పందిస్తుందని ఎదురుచూస్తున్నాం.
అల్లూరి, భీమ్ కలిసినట్లు చరిత్రలో లేదు ? దిన్ని ఎలా చూపిస్తున్నారు ?
రాజమౌళి : నేను ముందే చెప్పా. ఆర్ఆర్ఆర్ పూర్తిగా ఫిక్షన్. చరిత్రలో జరిగిన ఏ సంఘటన ఈ సినిమాలో లేదు. ఇది పూర్తిగా ఊహా. అంతా కల్పితం.
ట్రైలర్ చూస్తుంటే దేశభక్తి ఛాయలు కనిపిస్తున్నాయి ?
రాజమౌళి: లేదు. ఇది దేశభక్తి సినిమా కాదు. స్నేహం మీద ఆధారపడిన సినిమా. అయితే దేశభక్తి అండర్ ప్లేయ్ లో వుంటుంది.
ఆర్ఆర్ఆర్ రోమాన్స్ ఉంటుందా ?
రాజమౌళి : ఈ సినిమా బ్రోమాన్స్ వుంటుంది, ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహాన్ని ఇలా కూడా తీయోచ్చా? అనిపిస్తుంది. రోమాన్స్ లేదనే ఆలోచన కూడా రాదు. అంత అద్భుతంగా వుంటుంది.