పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని స్వయంతృప్తి పొందుతున్నారు. పవన్ కల్యాణ్ కు భారీ మెజార్టీ తెప్పించే బాధ్యతను వర్మే తీసుకున్నారు. తానే అభ్యర్థి అన్నంతగా కష్టపడుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారు.
అయినా పవన్ గెలిచినా అక్కడ వర్మే అనధికరిక ఎమ్మెల్యేగా ఉంటారు. పవన్ కల్యాణ్ కూడా అదే చెప్పారు. అయినా తల్లి, చెల్లినే వదిలిపోయిన లీడర్ దగ్గరకు వర్మ లాంటి నేతలు వెళ్తారని వైసీపీ సోషల్ మీడియా వాళ్లు ఎందుకు అనుకుంటున్నారో కానీ.. ఇలాంటి కుట్రలన్నీ పవన్ కల్యాణ్‌కు మరింత బలాన్ని పెంచుతాయనడంలో సందేహం లేదు. ఒక్క పవన్ ను ఓడించడానికి వందల కోట్ల ధనం.. మద్యం.. కుట్రలు, కుతుంత్రాలు.. పుకార్లు, స్మగ్లర్లను దింపుతున్నారు. ఇదంతా తమపై చేస్తున్న దాడిగా పిఠాపురం ప్రజలు అనుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ ను ఎంత టార్గెట్ చేస్తే ఆయన అంత బలపడతాడు. రాజకీయాల్లో చరిత్ర చెప్పింది ఇదే. నీలి, కూలీ మీడియాలో పుకార్లు పుట్టించుకుని.. అదే నిజమనుకుని ప్రచారం చేసుకుంటే చివరికి ఏం జరుగుతుందో తెలుసు. చివరికి వేమిరెడ్డిలాంటి వాళ్ల మీద ప్రచారం చేయించుకుని ఛీ కొట్టించుకున్నబాపతు మరి.