విశాఖ సుందరనగరం. ఆ నగరానికి రుషికొండ ఓ ఆభరణం. అక్కడకు వెళ్లే పర్యాటకులకు రుషికొండలోని హరిత రిసార్ట్స్ అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది బీచ్ వ్యూలో ఒకటి, రెండు రోజులు సేదదీరి మంచి జ్ఞాపకాలతో తిరిగి వెళ్తారు. ఆ ఒక్క రిసార్ట్స్ మీద ఏటా పాతిక కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇది ఇంకాఇంకా పెరుగుతుంది. అన్నీ అద్భుతమైన నిర్మాణాలు.
కానీ జగన్ రెడ్డి కన్ను వాటిపై పడింది. ఆ ప్లేస్లో ప్యాలెస్ కట్టుకుని తాను, తన భార్య మాత్రమే ఉండాలనుకున్నారు. వెంటనే అద్భుతంగా ఉన్న వంద కోట్లకుపైగా విలువైన హరిత రిసార్ట్స్ ను రూ. 93 కోట్ల ఖర్చుతో కూలగొట్టించారు. రుషికొండకు బోడిగుండు కొట్టించారు. తర్వాత వందల కోట్లతో ప్యాలెస్ కట్టించారు. గార్డెన్లు ఏర్పాటు చేశారు.
అది పర్యాటక అవసరాల కోసం అని చెప్పేది అంతా అబద్దం. ఓ క్యాంప్ ఆఫీసుకు ఏం కావాలో అలాగే కట్టించుకున్నారని దృశ్యాలు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు అది హోటల్ గా పనికి రాలేదు. ఇప్పుడు రాష్ట్రపతి,. ప్రధాని వంటి వారు వస్తే ఉండేందుకు విడిది గృహం అని వాదిస్తున్నారు. వారు ఐదేళ్లలో ఒకటి రెండు సార్లు కూడా విశాఖలో విడిది చేసిన సందర్భాలే లేవు. అంటే తమ తప్పును కప్పి పుచ్చుకోవడానికి రాష్ట్రపతి, ప్రధానిపై నెట్టేస్తున్నారు.
అది ఎందుకోసమే ప్రజలకు తెలుసు, బుకాయిస్తే అయ్యేది కాదు. మళ్లీ గెలిచి తీరుతానని ప్రజల్ని ఓ మాదిరిగా కూడా లెక్క చేయకుండా చేసిన విధ్వంసంతోనే ఇదంతా జరిగింది. ఓ మూర్ఖుని వల్ల ప్రకృతి విధ్వంసం జరిగిపోయింది. అతన్ని ఓడించినంత మాత్రం అదంతా తిరిగి రాదు. నష్టం .. నష్టమే.