సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం `చిత్రలహరి` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత మారుతి దర్శకత్వం వహించే ఓ చిత్రంలో నటించనున్నాడు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఓ ప్లీడరు పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. కథానాయికా రష్మిక పేరు పరిశీలిస్తున్నారు. అయితే రష్మిక ప్రస్తుతం యమ బిజీగా ఉంది. తన డేట్లు సర్దుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. డేట్ల సమస్యతోనే మహేష్ బాబుతో సినిమా కూడా వదులుకుందని టాక్. అందుకే ఇప్పుడు రష్మిక స్థానంలో మరో కథానాయికని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు మారుతి. ఆ ఛాన్స్ రకుల్‌ప్రీత్ సింగ్‌కి దక్కినట్టు సమాచారం. `విన్నర్`లో జోడీగా కనిపించారు సాయిధరమ్ – రకుల్. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే… వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే పండింది. అందుకే రకుల్ వైపు మారుతి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రకుల్ వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతోంది. అయినా సరే – అవకాశాల్ని చేజిక్కించుకుంటోంది. హీరోయిన్ల కొరత ఆ రేంజులో ఉంది మరి. ఫ్లాపులున్నా సరే – వాళ్లు తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు.