సాయిధరమ్ తేజ్ ఈమధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్రమాదం తరవాత ఫిజిక్‌ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో సహజంగానే లావయ్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త తగ్గాడు. అయితే ఆ తరవాతి సినిమాకి గ్యాప్ రావడంతో మళ్లీ పెరిగాడు. అయితే ఇటీవలే ఓ కొత్త సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమాలో తను సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తాడని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఫిట్నెస్ మెరుగుపర్చుకొని, బాగా తగ్గాడని, ఫిజిక్ కూడా కొత్తగా కనిపించబోతోందని తెలుస్తోంది. రోహిత్ పి.కె దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. స్వాతంత్ర్యం రాక పూర్వం జరిగిన కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో తేజ్ స్వాతంత్య్ర సమర యోధుడిగా కనిపించబోతున్నట్టు టాక్. అందుకోసమే ఈ సిక్స్ ప్యాక్. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూ.120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. తేజ్ కెరీర్లో ఇదే కాస్ట్లీ సినిమా. ప్రస్తుతం హైదరాబాద్ శివారల్లో షూటింగ్ జరుగుతోంది.
Also Read : నిర్మాతగా సాయిధరమ్ తేజ్
* పావలా శ్యామలకు సాయం
దీన స్థితిలో ఉన్న ప్రముఖ నటి పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ రూ.లక్ష ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఆ చెక్‌ను తేజ్ తరపున ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈరోజు పావలా శ్యామలకు అందజేశారు. అవసరమైతే భవిష్యత్తులో మరింత సహాయం అందిస్తానని ఈ సందర్భంగా తేజ్ మాట ఇచ్చారు. తేజ్‌కి ప్రమాదం జరిగినప్పుడు తానెంతో బాధ పడ్డానని, త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించానని, ఆయన తన మొర ఆలకించారని శ్యామల కన్నీరు పెట్టుకొన్నారు. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ సైతం తనకు సహాయపడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు శ్యామల.