రోడ్డు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో తేజ్ తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గత సంవత్సరం దర్శకుడు సంపత్ నందితో తేజ్ ఒక సినిమా ప్రకటించారు. అయితే ఆ సినిమా టైటిల్ వివాదంలో పడిన సంగతి తెలిసిందే. నార్కొటిస్ విభాగానికి చెందిన వారు ‘గంజా శంకర్’ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా అప్పట్లో కథనాలు వచ్చాయి.
అనంతరం సాయి ధరమ్ తేజ్ తన షార్ట్ ఫిలిం గురించి ఒక మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ‘గంజా శంకర్’ సినిమా ఉందో, లేదో తెలియదని మీడియా వల్లే చెప్పాలని షాక్ ఇచ్చారు. ఆ సినిమా ప్రకటించారు కానీ, ఆ తరువాత ఆ సినిమా షూటింగ్ గురించి కానీ, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కానీ ఎటువంటి ప్రకటన లేదు. అందువలన ఈ ప్రాజెక్టు లేనట్టే.
తాజా సమాచారం ప్రకారం, సాయి ధరమ్ తేజ్ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నారనే విషయం తెలిసింది. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై విజయవంతమైన చిత్రంగా నిలిచింది ‘హనుమాన్’. ఈ సినిమా నిర్మాత కె నిరంజన్ రెడ్డి, సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయనున్నారని ఫిలింవర్గాల టాక్. ఈ సినిమా ద్వారా ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారని కూడా తెలిసింది. స్టోరీ కంప్లీట్ అయిందని త్వరలోనే సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలిసింది.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఒక పీరియడ్ డ్రామాగా ఉండబోతుందని తెలిసింది.