తొలి సినిమాకే మావయ్య పాటని రీమిక్స్ చేసి – మెగా అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు సాయి ధరమ్ తేజ్. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాల్లో ఈ ఆనవాయితీ పాటించాడు. ఆ రెండు సినిమాలూ హిట్ అయ్యాయి. ఇప్పుడు టైటిళ్లపై పడ్డాడు. చిరంజీవి నటించిన ‘మహానగరంలో మాయగాడు’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ టైటిల్‌ని వాడుకొనే పనిలో పడ్డాడు సాయిధరమ్ తేజ్. మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా ఓ సినిమా రూపుదిద్దుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథ రెడీ అయిపోయిందట. ఈ చిత్రానికి ‘మహానగరంలో మాయగాడు’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మారుతి భావిస్తున్నాడు. మావయ్య సినిమా టైటిల్ అంటే సాయిధరమ్ ఎలాగూ కాదనలేడు. పైగా మెగా ఫ్యాన్స్‌ని ఆకర్షించినట్టవుతుంది. అందుకే.. మారుతి దృష్టి ఈ టైటిల్ పై పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జవాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు సాయి. ఆ తరవాత వినాయక్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాకే మారుతి సినిమా పట్టాలెక్కుతుంది.