హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో ‘ఈగ, లెజెండ్, ఉహలు గుస గుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, తుంగభద్ర’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వారాహి చలనచిత్రం సంస్థ అధినేత సాయి కొర్రపాటి తన సహృదయతను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి తనవంతుగా భూరివిరాళమందించారు. కృష్ణాజిల్లాలో ‘బాహుబలి’ చిత్రం బెనిఫిట్ షోను ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి అందజేస్తానని ఇటీవల ప్రకటించిన కొర్రపాటి, తన మాటను నిలబెట్టుకున్నారు. ఆ బెనిఫిట్ షో ద్వారా వచ్చిన రు.24,56,789 ను ఇవాళ చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి ద్వారా ఏపీ ప్రభుత్వానికి అందజేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి సేవారంగంలోకూడా పేరు తెచ్చుకోవటం విశేషం.