రోడ్డు ప్రమాదం తరవాత.. సాయిధరమ్ తేజ్ మీడియా ముందుకు రాలేదు. తేజ్‌కి సంబంధించిన ఒకట్రెండు ఫొటోలు వచ్చాయి గానీ, అవి కుటుంబ సభ్యులు విడుదల చేసినవే. అయితే ప్రమదం తరవాత తొలిసారి తేజ్ .. మీడియాకు కనిపించనున్నాడు. అదీ.. రేపే.
రిపబ్లిక్ సినిమా శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని జీ 5 సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా రిపబ్లిక్ ప్రీమియర్స్‌కి సంబంధించిన ఓ ప్రెస్‌మీట్ నిర్వహించబోతోంది జీ 5 టీమ్.ఈ ప్రెస్ మీట్లో చిత్రబృందం పాల్గొనబోతోంది. వారితో పాటుతేజ్ కూడా రానున్నాడు. ప్రమాదం కారణంగా ఆసుపత్రి పాలైన తేజ్.. రిపబ్లిక్ ప్రమోషన్లకు దూరం అయ్యాడు. రిపబ్లిక్ కి సంబంధించిన ఒక్క ఈవెంట్ లో కూడా తేజ్ లేడు. కాబట్టి.. ఈసారి తేజ్ ని తీసుకురావాలనుకుంది చిత్రబృందం. తేజ్ ప్రమాదాన్ని మీడియా వాళ్లు ఏ రేంజ్లో కవర్ చేశారో తెలియంది కాదు. తేజ్ గురించి చిలవలు, పలవలుగా రాశారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? అన్నది తేజ్ చెబితే గానీ స్పష్టత రాదు. ఈసారి… ఈ ప్రెస్ మీట్ లో ఆ స్పష్టత రానుంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ తో కొన్ని డౌట్లు క్లారిఫై అయిపోతాయి.