రాజకీయాల్లో మానసిక దాడులు చేసే కుట్రల్లో సజ్జల రామకృష్ణారెడ్డిది ప్రత్యేక పాత్ర. నోటీసు ఇస్తే స్టేషన్ కు వచ్చే వ్యక్తుల ఇళ్లపైకి అర్థరాత్రి పోలీసుల్ని పంపి అరెస్టు చేయిస్తాడు. అప్పటి వరకూ ఇంట్లో ఉన్న వ్యక్తిని వదిలేసి.. ఆ వ్యక్తి ఎయిర్ పోర్టుకు పోతే.. పోలీసుల్ని పంపి అరెస్టు చేయిస్తాడు.. ఇలాంటి తెలివి తేటలతో ఎదుటి వ్యక్తుల్ని మానసికంగా వేధించానని సంతృప్తి పడే మానసిక స్థితి ఉన్న సజ్జల అండ్ కో ఇప్పుడు తమ తెలివి తేటల్ని సొంత క్యాడర్‌పై ప్రయోగిస్తూ వారిని టార్చర్ కు గురి చేస్తున్నారు.
వైసీపీ గెలుస్తుంది అని నమ్మకం కలిగించాలంటే.. . 2019లో వైసీపీ వ్యవహరించినట్లుగా ఉండాలి. కానీ ఇప్పుడేం చేస్తున్నారు… ఈసీపై నిందలేస్తున్నారు. ఎన్నికలు సరిగ్గా జరగలేదంటున్నారు.. ఈసీకి చంద్రబాబు వైరస్ అంటారు… టీడీపీ రీపోలింగ్ అడగడం లేదంటారు… పోస్టల్ బ్యాలెట్లపై రచ్చ చేస్తారు… కౌంటింగ్ లో నిబంధనలు పాటించవద్దంటారు.. ఈ ట్రాన్స్ ఫర్మేషన్ చూసి… వైసీపీ క్యాడర్ లో కూడా… ఓడిపోతామని ఇంత నేరుగా చెప్పాల్సిన అవసరం ఏముందని… కాస్త ధైర్యం వచ్చేలా వ్యవహరించవచ్చు కదా అని మండి పడుతున్నారు.
వైసీపీ క్యాడర్ లో పూర్తిగా ఆత్మవిశ్వాసం దిగజారిపోవడానికి కారణం సజ్జల చేసిన మైండ్ గేమ్ రాజకీయమే. ఓ వైపు పరిస్థితి ఘోరంగా ఉందని జాతీయస్థాయి ప్రముఖ సర్వేలు చెబుతూంటే… కుప్పంలో గెలుస్తున్నాం.. మంగళగిరిలో జెండా పాతుతున్నాం.. పిఠాపురం మనదే అంటూ.. నీలి, కూలి మీడియాల్లో అసాధ్యమైన … చూసే వాళ్లు కూడా ఇలా కూడాజరుగుతుందా అని ఆశ్చర్యపోయే రీతిలో కథనాలు రాయిస్తున్నారు. అంతేనా రియాలిటీని అసలు ఆలోచించకుండా ప్రకటనలు చేస్తూ… మరో వైపు ఎన్నికల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తూంటే.. .వైసీపీ క్యాడర్‌కు ఎలా ధైర్యం వస్తుంది ?
పోలింగ్ సమయంలో జరిగిన పరిణామాలతో ఈ సారి కౌంటింగ్ ఏజెంట్లు కూడా కిందా మీదా పడే పరిస్థితి వచ్చింది. ఓడిపోతారని మానసికంగా రెడీ కావడంతో ఎక్కడ కాడి దించేస్తారోనని.. సజ్జల కంగారు పడుతున్నారు. అందుకే రౌడీయిజం చేయమని అంటున్నారు. కానీ జగన్ రెడ్డిని చూసుకుని రెచ్చిపోయిన వారికి ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. వారు కూడా రెడీగా లేరు. అదే అసలు సజ్జల బాధ.