వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ అత్యంత మూర్ఖ శిఖామణిగా వ్యవహరిస్తున్న తీరు చూసి జనం అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయని చెబుతున్న ఆయన… అందరూ తనలాగా రోడ్డున పడటం లేదని భార్యబిడ్డలపై తప్పుడు కేసులు పెట్టడం లేదని గుర్తించలేకపోతున్నారు. కుటుంబ వ్యవహారాలను నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలన్న కనీస ఇంగిత జ్ఞానం ఆయనకు లేదు. రోడ్డున పడేసుకుని మీడియాకు ఎక్కి.. అందరికీ బతుకు జట్కాబండి షో చూపిస్తున్నారు. తన పరువునే కాదు తన భార్య బిడ్డలను కూడా మీడియా చానళ్లకు ఎక్కించారు.
దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ అధికారంలోకి వచ్చాక అధికారం చెలాయించారు. ఈ క్రమంలో పరాయి మహిళ ట్రాప్ లో పడ్డారనేది టెక్కలిలో అందరికీ తెలుసు. గత మూడేళ్లుగా ఈ వ్యవహారం మరీ దారుణంగా మారింది. ఇంటికి వెళ్లకుండా ఆ మహిళతోనే ఉంటున్నారు. దీంతో ఆయన భార్యా పిల్లలు ఆందోళన చెందారు. పార్టీ హైకమాండ్ వద్ద పంచాయతీ పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి వారి పంచాయతీకి పరిష్కారం చూపారు. ఆస్తులు, వ్యాపారాలను భార్యా పిల్లలపైకి మార్చుతానని హామీ ఇచ్చారు. అయితే అవేమీ చేయలేదు. పైగా ఆ మహిళ కోసం కరిగించడం ప్రారంభించారు. దీంతో మరోసారి ఈ విషయాన్ని దువ్వాడ వాణి సజ్జల దృష్టికి తీసుకెళ్లారు. ఆమె తాను తన ఆందోళనకు దిగుతానని హెచ్చరించగానే .. టిక్కెట్ మీకేనని చెప్పి బుజ్జగించి పంపారు. ఇంచార్జ్ గా ప్రకటించారు.
Read Also : టీవీ చానళ్లలో నాన్ స్టాప్ దువ్వాడ ఫ్యామిలీ బతుకు జట్కాబండి షో !
ఎన్నికలకు ముందు సర్వేల పేరుతో ఆమెకు టిక్కెట్ నిరాకరించారు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమయ్యారు. దువ్వాడ శ్రీవాణి తండ్రి మాజీ ఎమ్మెల్యే . వారికి రాజకీయ నేపధ్యం ఉంది. ఆమె జడ్పీటీసీ కూడా. అయితే మరోసారి ఆస్తులన్నీ భార్యాబిడ్డలపై రాయిస్తానని సజ్జల హామీ ఇప్పించి ఎన్నికల బరి నుంచి తప్పించారు. తీరా ఓడిపోయిన తర్వాత ఆస్తులేమీ భార్యాపిల్లలకు ఇవ్వకపోగా.. ఆ మహిళతో కలిసి జల్సాలు చేయడం ప్రారంభించారు. దీంతో మొత్తం ఆ మహిళ నాకేయడం ఖాయమన్న ఉద్దేశంతో వీరు రోడ్డెక్కారు. పంచాయతీ చేసిన సజ్జల ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు.
దువ్వాడ ఇవాళ కాకపోతే.. మరో రెండేళ్లకైనా రోడ్డున పడతారు. ఆ మహిళతో సంబంధం ఎప్పుడైనా ముగిసిపోతుందని.. ఇలాంటి వ్యవహారాల పరిణామాల గురించి అవగాహన ఉన్న వారు అర్థంచేసుకుంటారు. ఆ పాపం.. సజ్జలదే అవుతుంది. కుటుంబంలో ఉన్న వివాదాలు తమ వద్దకు వచ్చినప్పుడు.. దువ్వాడను మందలించి కుటుంబాన్ని చూసుకోవాలని చెప్పాల్సింది పోయి… ఆస్తులు పంచాయతీ చేసి విడగొట్టేసి అదే పరిష్కారం అని చెప్పాలనుకున్నారు. చివరికి వికటించింది. ఓ నేత కుటుంబం రోడ్డున పడింది.