తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీలు పొత్తుల దిశగా కదులుతూ ఉంటే వైసీపీ పొత్తులు పెట్టుకోవడం తప్పని వాదిస్తోంది. జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పొత్తులు పెట్టుకుంటున్నారని అంటున్నారు. ఇందులో మొహమాటం ఏమీ లేకుండా వారే చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి వస్తే ఏపీ అంధకారం అయిపోతుందని .. ఆయనను మళ్లీ సీఎం కానివ్వబోమని చెబుతున్నారు. ఇందులో కుట్రలు కుతంత్రాలు ఏమున్నాయో కానీ సజ్జల మాత్రం అదేదో అన్వాంటెడ్ అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు.
మనది ప్రజాస్వామ్య దేశం. మెజార్టీ ప్రాతిపదికగా గెలుపోటములు నిర్ధారమ అవుతాయి. పది మందిపోటీలో ఉండి. ఒక్కడు పదకొండు ఓట్లు తెచ్చుకుని మిగతా తొమ్మిది మంది పది ఓట్లు తెచ్చుకున్నా గెలుపు పదకొండు ఓట్లు తెచ్చుకున్న వాడిదే. ఆయనకు వ్యతిేకంగా 89 ఓట్లు వచ్చాయి కదా అని వాదించుకోవచ్చు. కానీ గెలవలేదని చెప్పడానికి రాజ్యాంగం అవకాశం ఇవ్వలేదు. అందుకే భారత ప్రజాస్వామ్యంలో పొత్తులు అనేవి కామన్. భావసారుప్యత గురించి కూడా సజ్జల మాట్లాడుతున్నారు. నేటి రాజకీయాల్లో భావసారూప్యత అంటే ప్రత్యర్థిని ఎన్నికల్లో ఓడించడం మాత్రమే.
అయితే పవన్ కల్యాణ్‌ను నియంత్రించాలనుకుని.. ఆయనపై లేని పోని మాటలతో రెచ్చగొట్టేలా వ్యవహరించడం.. ఆయనను ఒంటరిగా పోటీ చేసేలా చేయాలని చూడటం వైసీపీ నేతలు మాట్లాడటం లేదు. వైసీపీ వ్యూహాలను జగన్ ఖరారు చేస్తారో సజ్జల ఖరారు చేస్తారో కానీ.. ఈ అంశంలోనూ ఆయనే వచ్చి మాట్లాడుతున్నారు. టీడీపీ, జనసేన మధ్య భావసారూప్యత లేదన్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయనేసరికి.. వైసీపీలో ఓ టెన్షన్ అయితే కనిపిస్తోంది. దాన్ని దాచుకోలేకపోతున్నారు. ఇప్పటికీ పొత్తులు ఖరారు కాలేదు కాబట్టి ఆపాలనే విశ్వప్రయత్నం చేస్తున్నారు.