జగన్ రెడ్డి పరిపాలనపై కేసీఆర్ అవమానకర వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం తుడిచేసుకుంది. కేసీఆర్ కేవలం ఎన్నికల కోసమే ఆ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. అంతే కానీ ఆయన ప్రతి విమర్శ కానీ.. మరో ఆరోపణ కానీ చేయాలనుకోలేదు. ఏపీలోలా పెన్షన్లు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారని.. అదే పెద్ద సర్టిఫికెట్ అన్నట్లుగా చెప్పుకున్నారు. సజ్జల వ్యవహారం చూసి.. మోదీనే కాదు.. కేసీఆర్ ను చూసినా వణికేనా.. ఘోరంగా అవమానించినా.. ఏదో మీ దయ అన్నట్లుగా తుడుచుకుని పోవడమే మేనా అని వైసీపీ నేతలే నోరెళ్లబెడుతున్నారు.
సజ్జల కవర్ చేసుకున్న దాని ప్రకారం చూస్తే.. జగన్ రెడ్డి పాలనను విమర్శిస్తే.. తెలంగాణలో ఓట్లుపడతాయి. ఏపీలో ఉన్న దారుణ పరిస్థితుల్ని.. తెలంగాణ ఉన్న పరిస్థితులతో పోలిస్తే.. తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉందన్న కారణంగా ఓట్లు వేస్తారు. అంతే కానీ.. అలా కంపేర్ చేసినప్పుడు ఏపీ దౌర్భాగ్యన్ని ప్రపంచం ముందు పెడుతున్నారన్న ఆలోచన మాత్రం..జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కు రావడం లేదు. వచ్చినా వాళ్లకు పోయేదేమీ ఉండదు. ఎందుకంటే మా ఓటర్లు వేరే అనేది వాళ్ల నమ్మకం. ఏపీని కించ పర్చినా .. తమను కించపర్చినా.. పలనా వైఫల్యాలను- ఎండగట్టినా చివరికి… రైతుల మెడకు మీటర్లు పెట్టి ఉరేశారని విమర్శించినా కేసీఆర్ నోరెత్తలేనంత నిస్సహాయ స్థితికి వెళ్లిపోయారు.
రాష్ట్రానికి రావాల్సినవన్నీ తాకట్టు పెట్టేశారు. చివరికి కరెంట్ బకాయిలు కూడా ఇప్పించుకోలేకపోయారు. అధికారంలోకి రాగానే భవనాలు ఇచ్చేశారు. అధికారం చేతిలో ఉన్నా ఇంత నిస్సహాయమైన స్థితిలో ఉన్న ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాలు, గౌరవాన్ని కాపాడలేని ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదేమో ?