వైసీపీ నేతలు తాము ఏది చెస్తే అది.. ఏం చెబితే అది మాత్రమే ఫైనల్ అనుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును సైతం … వాళ్లు చెబితే కరెక్టా అని స్పందిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో సీల్ లేకపోతే చెల్లకూడదని వాదిస్తున్న వైసీపీ.. ఈసీపై న్యాయపోరాటం చేస్తోంది. సీల్ లేకపోయినా చెల్లుతాయని ఈసీ స్పష్టం చేయడంతో హైకోర్టు.. అక్కడ్నుంచి సుప్రీంకోర్టుకూ వెళ్లింది. అయినా సానుకూల ఫలితం రాకపోయే సరికి కోర్టుపై నిందలేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పినా తప్పేనని వాదించేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
అప్పటికే వ్యవస్థలన్నీ కలిసి జగన్ రెడ్డిని ఓడిస్తున్నాయంటూ కొత్త కథలను ఆయన నేతృత్వంలోని సాక్షి సలహా మండలి ప్రారంభించేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలో నేరుగా అన్ని వ్యవస్థలపై నిందలేశారు. వైసీపీ చెప్పినట్లుగా చేయకపోవడం వ్యవస్థలు సరిగ్గా పని చేయకపోవడమని అనేశారు. తమ మాట వింటే సరే లేకపోతే చంద్రబాబు మేనేజ్ చేశారని ఆరోపించడం అలవాటు చేసుకున్న వైసీపీకి ఓటమి కళ్ల ముందు కనిపిస్తూంటే.. సుప్రీంకోర్టుపైనా అదే నిందలేస్తున్నారు.
ప్రజాభిప్రాయాన్ని వైసీపీ ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఎన్నికల ఫలితాలకు వక్రభాష్యం చెప్పేందుకు రెడీ అయిందని తాజా పరిణామాలతో నిరూపితమయింది. సుప్రీంకోర్టు చెప్పినా అంతా మేం చెప్పిందే కరెక్ట్ అనుకుంటే.. ఎవరూ ఏమీ చేయలేరు కానీ… ఆ వ్యవస్థలే నిజంగా మేనేజ్ అయితే.. వైసీపీ అధినేత.. ఆయన వంది మాగధులు ఎప్పుడో జైళ్లలో ఉండేవారనేది అందరూ చెప్పేమాట.