సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకు రూల్స్ పాటించవద్దని చెప్పి పంపించారు. శిక్షణా కార్యక్రమం పెట్టి రూల్స్ చెప్పాల్సిన పెద్ద మనిషి రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ కు వెళ్లొద్దని రూల్స్ విరుద్ధంగా వైసీపీకే ఓట్లు లెక్కించేలా గట్టిగా ఆర్గ్యూ చేసే వాళ్లే వెళ్లాలని సలహా ఇచ్చారు. సజ్జల ఇచ్చిన సలహా విని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది.
కౌంటింగ్లో గందరగోళం చేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా స్పష్టంగా కనిపిపిస్తోంది. మరో వైపు ఈసీ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంది. తేడా వస్తే చితక్కొట్టేయడానికి భారీ ఏర్పాట్లు చేసుకుంది. అయినా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టి.. ఏదో చేయాలని చెప్పి పంపిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా రిటర్నింగ్ ఆఫీసర్దే నిర్ణయం. ఇండిపెండెంట్ల కౌంటింగ్ ఏజెంట్లను కూడా కొన్నారని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. ఇరవై మంది వరకూ ఏజెంట్లు ఉంటారని వాళ్లలో సగం మంది వైసీపీ వాళ్లే ఉంటారని.. గందరగోళం చేస్తామని ఇప్పటికే పేర్ని నాని ఇన్ డైరక్ట్ గా చెప్పారు.
ఇప్పుడు సజ్జల రూల్స్ పాటించవద్దని తమ కౌంటింగ్ ఏజెంట్లకు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల ప్రక్రియను ప్రతి విషయంలోనూ మ్యానిప్యులేట్ చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ చివరికి కౌంటింగ్ దగ్గరా అదే ప్లాన్ చేసుకోవడం.. వారి దివాలా కోరు తనానికి నిదర్శనంగా ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎవరైనా పక్కాగా రూల్స్ పాటించాలనిచెబుతారు కానీ.. రూల్స్ ఉల్లంఘించాలని చెప్పి పంపించే పార్టీ ఒక్క వైసీపీనేనన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఘనత సజ్జలదే.