ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను అందరూ కామెడీగానే తీసుకుంటున్నారు. కానీ వైసీపీ మాత్రమే సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కేఏ పాల్ తమ పార్టీ ఓట్లను చీల్చడానికే వచ్చారని… టెన్షన్ పడుతోంది. ఈ మేరకు.. ఈ రోజు.. శ్వేతారెడ్డి అనే యాంకర్ ను సాక్షి మీడియా తెరపైకి తీసుకు వచ్చింది. ఆమెతో.. కేఏ పాల్ పై.. విమర్శల దాడి చేయించింది. శ్వేతారెడ్డి ప్రెస్ మీట్ ను.. మిగతా మీడియా లైట్ తీసుకున్నా… సాక్షి మాత్రం ప్రధానమైన కవరేజీ ఇచ్చింది. అందులో అంతిమంగా… ఆమె చెప్పిన సందేశం.. కేఏ పాల్.. వైసీపీ ఓట్లను చీల్చడానికే ప్రజాశాంతి పార్టీ పెట్టి.. ఏపీ మొత్తం తిరుగుతున్నాడని.
ఇంతకీ ఈ శ్వేతారెడ్డి ఎవరంటే.. ఓ టీవీ చానల్ లో యాంకర్. టీఆర్పీ కోసం.. కేఏ పాల్ తో కామెడీ పండించేందుకు ఈమె యాంకరింగ్ తో ఓ లైవ్ షో చేశారు. ఆ సమయంలో.. హిందూపురం నుంచి బాలకృష్ణపై ఆమెను.. నిలబెడతానని.. కేఏ పాల్ హామీ ఇచ్చారు. అప్పటికి ఆమె నవ్వుకుంది కానీ.. సీరియస్ గా తీసుకున్నారట. తనకు టిక్కెట్ ఇస్తానని చెప్పి.. ఇప్పుడు కేఏ పాల్ … వేరే వారికి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని.. మీడియా ముందుకు వచ్చింది. తనను ప్రజాశాంతి పార్టీ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించారని … ఈ నెల 21 వరకు 10 వేల సభ్యత్వాలు చేయించమన్నారని కానీ 21వ తేదీ రాకముందే వైజాగ్ సభలో శ్వేతారెడ్డి అడ్రస్ లేకుండా పోయారని ఆరోపించారని.. ఆమె అంటున్నారు. దీనిపైనే శ్వేతారెడ్డికి అనుమానాలున్నాయట. హిందూపురం టికెట్‌ను ఇంకెవరికైనా అమ్ముకునేందుకు ఈ ప్రకటన చేశారా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
క్రిస్టియన్ కమ్యూనిటీని అవమానపరిచేలా పాల్ వ్యవహరిస్తున్నారని శ్వేతారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు రాజకీయం చేస్తున్నట్లుగా తనకు అనుమానంగా ఉందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ పాదయాత్ర చేశారని ఆమె పొగడ్తల వర్షం కురిపించారు. శ్వేతారెడ్డి ప్రెస్ మీట్ వెనుక.. వైసీపీ, సాక్షి మీడియా ఉందని.. అందరికీ తెలిసిపోయింది. కానీ కేఏ పాల్ ను..వైసీపీ ఎందుకు అంత సీరియస్ గా తీసుకందో.. ఎవరికీ అర్థం కాలేదు. అయితే .. క్రిస్టియన్ ఓట్లన్నీ.. జగన్ కే పడతాయని ఇప్పటి వరకూ అనుకున్నారు కానీ… కేఏ పాల్ రాష్ట్రమంతా తిరుగుతూ ఉండటంతో.. రెండు, మూడు శాతం ఓట్లయినా పోతాయేమోననే భయంతో శ్వేతారెడ్డిని రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ శ్వేతారెడ్డి వార్తలు మాత్రమే చదవరు.. అప్పుడప్పుడు వార్తల్లో ఉంటారు. గతంలో మద్దెల చెర్వు సూరి హత్య కేసులో ఈమె పేరు బయటకు వచ్చింది. ఆమెను బినామీ సూరి పెట్టుకున్నారని చెప్పుకున్నారు. కానీ బంధుత్వం ఉంది కానీ.. సూరి ఆస్తులు, హత్యలతో సంబంధం లేదని చెప్పుకున్నారు. కానీ ఈ శ్వేతారెడ్డి ఎవరో తెలియదని..సూరి బార్య భానుమతి అప్పట్లోనే ప్రకటించారు.