వైఎస్ చనిపోయిన తర్వాత ఆరు నెలల వరకూ సాక్షి పత్రికలో ప్రతి రోజూ … వైఎస్ కోసం చనిపోయిన వారి జాబితాలో కొత్త కొత్త పేర్లు యాడ్ అవుతూ ఉండేవి. వారంతా వైఎస్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారని చెప్పవారు. ఈ కామెడీ ఏమిటో అనుకునేవారు చాలా మంది . కానీ జగన్ రెడ్డి శవరాజకీయం గురించి తెలిసిన తర్వాత వారే ఆశ్చర్యపోయారు.
వారంతా తన తండ్రి కోసం చనిపోయారని.. ఓదారుస్తానని ఓదారపు యాత్ర ప్రారంభించారు. అది కూడా బలప్రదర్శనలా. అసలు ఓదార్పు యాత్ర అలాచేస్తారా అని ఆశ్చర్యపోయారు. చనిపోయిన వాళ్లెవరూ వైఎస్ కోసం చనిపోలేదు. ఎయిడ్స్ లతో చనిపోయిన వాళ్లు.. కూడా ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మభ్యపెట్టడంలో జగన్ స్టైలే వేరు. ఇప్పుడు కూడా అదే పని చేయబోతున్నారు. రోజూ సాక్షి పత్రికలో… జగన్ గెలవలేదని చనిపోయారంటూ కొన్ని పేర్లతో వార్తలొస్తున్నాయి.
ఇప్పటికి ఫలితాలు వచ్చి రెండు వారాలు దాటిపోయింది. అప్పట్నుంచి మానసిక వేదకు గురై ఇప్పటికీ చనిపోతున్న వారి గురించి రాస్తున్నారంటే… దానర్థం ఓదార్పు యాత్ర కోసం రెడీ అవుతున్నట్లే. అది ఎప్పట్నుంచి చేస్తారో కానీ… ఆయన ఓదార్పు యాత్రలు ఈ సారి గతంలోలా ఉండవని టీడీపీ నేతలు చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబుపై రాళ్లదాడి.. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు.. అన్నీ చూసిన తర్వాత… జగన్ సాఫీగా యాత్ర చేయాలనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు.