మొత్తానికి నాగచైతన్య – సమంత ఒక్కటయ్యారు. శుక్రవారం హిందూ సంప్రదాయం ప్రకారం ఈ ప్రేమికులు భార్యాభర్తలుగా మారారు. ఈరోజు (శనివారం) క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చర్చ్‌లో పెళ్లి జగరబోతోంది. ఆదివారం గోవాలోనే పెద్ద పార్టీ జరగబోతోంది. పెళ్లి సెలవలు వారం రోజులు మాత్రమే తీసుకొన్న సమంత, చై… ఈనెల 15 నుంచి మళ్లీ షూటింగులతో బిజీ అయిపోతారు. అయితే త్వరలోనే చై – సమంత హనీమూన్‌కి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. హనమూన్ కోసం వీరిద్దరూ మంచి ప్లానే వేశారు.
చై – సమంత జోడీ కట్టిన తొలి సినిమా ‘ఏం మాయ చేశావె’. ఆ సినిమాతోనే వీరిద్దరి ప్రణయగాధ మొదలైంది. అలా.. తమ ప్రేమకు ఆ సినిమా సాయం చేసినట్టైంది. ఆ సినిమాని, ఆ రోజుల్లో గుర్తు చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకొన్నార్ట. అందుకే… ‘ఏ మాయ చేశావె’ కోసం తిరిగిన లొకేషన్లనే హనీమూన్ కోసం వెళ్లాలని భావిస్తున్నట్టు టాక్. కేరళ, పొలాచ్చీలలో.. ఈ సినిమా షూటింగ్ జరిగింది. పాటల కోసం విదేశాలూ చుట్టొచ్చారు. ఏ మాయ చేసావె షూటింగ్ ఎక్కడెక్కడ జరిగిందో.. అక్కడక్కడకి మళ్లీ వెళ్లాలన్నది చై – సమంతల ప్లాన్. అక్టోబరులో వీరిద్దరూ హనీమూన్ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.