హీరోల్లో వెంకటేష్ రీమేక్ రాజా. పక్క భాషలో ఓ సినిమా వస్తే.. లటుక్కున లాగేసుకుంటాడు. హీరోయిన్లలో సమంత కూడా ఇప్పుడు వెంకటేష్‌లా తయారవుతోంది. తాను రీమేక్ క్వీన్‌గా మారిపోయింది. సాధారణంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే.. సొంత కథతోనే తీస్తారు. రీమేకులు చాలా తక్కువ. కానీ సమంత మాత్రం రీమేక్‌లనే ఎంచుకుంటోంది. `యూటర్న్` ఓ రీమేక్కథ. తమిళంలో హిట్టయిన సినిమాని తెలుగులో తీశారు. బాగానే ఆడింది. ‘ఓ బేబీ’ కూడా సొంత కథేం కాదు. అదీ రీమేక్ వంటకమే. ఆ సినిమాతో సమంతకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ‘జానూ’ సినిమానీ తన వైపుకే తిప్పుకుంది. 96కి రీమేక్ ఇది. త్రిష చేసిన పాత్రని తెలుగులో ఎవరు చేస్తారా అనుకునే సమయంలో సమంతనే గుర్తొచ్చింది. ఆ పాత్రకు సమంత పూర్తి న్యాయం చేసింది. ఇప్పుడు జానూ రీమేక్‌లో సమంతని తప్ప, ఇంకెవ్వరినీ ఊహించుకోలేం. ఆ స్థాయిలో ఆ పాత్రలో ఇమిడిపోయింది. 96 చూసినవాళ్లకు సైతం ‘సమంత బాగానే చేసింది’ అనే ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇక మీదట.. రీమేక్ అనగానే హీరో కథైతే వెంకటేష్ గుర్తొచ్చినట్టు, హీరోయిన్ కథంటే.. సమంత గుర్తుకువస్తుందేమో..?