బిగ్ బాస్ షో నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు సంపూర్ణేష్ బాబు. ‘నేనిక్కడ ఉండలేను… నన్ను పంపించేయండి’ అంటూ ఏడుస్తూ బిగ్ బాస్‌ని వేడుకొన్నాడు. దాంతో సంపూని బయటకు పంపక తప్పలేదు. అయితే… ఒప్పందాన్ని అతిక్రమించినందుకు సంపూకి పెనాల్టీ పడిందట. దాదాపుగా రూ.16 లక్షలు సంపూ బిగ్ బాస్ కి చెల్లించాల్సివచ్చిందని తెలుస్తోంది. షో నుంచి ఎలిమినేట్ రూపంలో కాకుండా, సొంత కారణాలతో బయటకు వచ్చేయాలనుకొంటే… నిబంధనల ప్రకారణం ఇవ్వాల్సిన పారితోషికానికి బదులుగా పెనాల్టీ కట్టాల్సివస్తుందట. అలా.. సంపూకి రూ.16 లక్షల పెనాల్టీ పడిందని, ఆ సొమ్ము ఇచ్చేస్తానని చెప్పడంతో సంపూని బయటకు పంపారని తెలుస్తోంది. 70 రోజులు సంపూ బిగ్‌బాస్ సెట్లో ఉంటే.. దాదాపుగా రూ.70 లక్షల వరకూ సంపాదించే అవకాశం ఉండేది. మధ్యలో రావడం వల్ల.. ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకోవడం వల్ల సంపూ రూ.16 లక్షలు నష్టపోవాల్సివచ్చింది.