‘అర్జున్ రెడ్డి’ సినిమాతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. త్వరలోనే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. ‘స్పిరిట్’ పేరుతో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో అలరించనున్నాడు. తాజాగా ఈ సినిమా నిర్మాత భూషణ్‌కుమార్ మాట్లాడారు.
”స్పిరిట్ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇది చాలా స్పెషల్ సినిమా. పోలీస్ డ్రామా. ఇందులో ప్రభాస్ తొలిసారి ఖాకీ దుస్తులలో కనిపిస్తారు. ఈ చిత్రం గురించి ఒక విషయం కచ్చితంగా చెప్పగలను. ఇందులో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ని చూస్తారు’’ అని భూషణ్ కుమార్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సందీప్‌వంగా బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌తో బీటౌన్లోకి అడుగుపెట్టిన ఈ డైరెక్టర్ రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమా తెరకెక్కిస్తున్నారు.