ప్రముఖ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. ఇటీవల ఆయన డయేరియాతో డీ హైడ్రేషన్‌కి గురయ్యారు. ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారు. అయితే… ఈరోజు ఉదయం ఆయన మళ్లీ డీ హైడ్రేషన్‌కి గురి కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటున్నారు. శరత్ కుమార్‌కు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. 2020లో శరత్ కుమార్ కరోనా బారీన పడ్డారు. అయితే ఆ తరవాత కోలుకొన్నారు. కరోనా తరవాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ అస్వస్థతకు గురి కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.