విశాఖపట్నం బహుముఖంగా విస్తరించబోతోంది. కొత్త వలసతో ఇప్పటికే కలసిపోయింది. మరో వైపు భోగాపురం వరకూ కొత్త సిటీకి రూపకల్పన జరుగుతోంది. భీమిలి, భోగాపురం వైపు సరికొత్త శాటిలైట్ సిటీకి రూపకల్పన జరుగుతోంది. బీచ్ రోడ్ కు సమాంతరంగా ఈ సిటీని అభివృద్ధి చేసే అవాశాలు ఉన్నాయి. నివాస సదుపాయాలలో పాటు అత్యున్నతమైన వాణిజ్య, వ్యాపార, ఆతిధ్య, వినోద రంగాలకు ఎక్కువ ప్రాధన్యం ఉండేలా ఈసిటీలో సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.
భిమిలీ ఇప్పటికే విశాఖలో కలిసిపోయింది. బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం ఊపందుకుంటున్న సమయంలో విశాఖలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వస్తున్నాయి. నార్త్ విశాఖ అత్యాధునిక సౌకర్యలతో కూడిన ప్రాంతంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఆ దిశగా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
విశాఖను ప్రశాంతంగా ఉంచితే… ఆ నగరంలో ఉండేదుకు పెట్టుబడుు పెట్టేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ విషయంలో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకోనుంది. ఎలాంటి న్యూసెన్స్ ఉండకుండా పీస్ ఫుల్ సిటీగా ఉంచేందుకు .. కొత్త వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. ఈ క్రమంలో … న్యూ విశాఖను .. శాటిలైట్ సిటీ రూపంలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో విశాఖ కొత్త శాటిలైట్ సిటీ.. దేశంలోని ప్రముఖ లగ్జరీయస్ ప్రదేశాల్లో ఒకటిగా పేరు పొందే అవకాశం ఉంది