ప్రముఖ నటి జయప్రద ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి నీలవేణి కొద్ది సేపటిక్రితం మృతి చెందారు. కొంతకాలంగా నీలవేణి అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం జయప్రద ఢిల్లీలో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె.. హైదరాబాద్కు హుటాహుటిన బయలు దేరారు. నీలవేణి అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరుగుతాయి.