హైదరాబాద్లో పదేళ్ల కిందట ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గరగా ఇల్లు అంటే వామ్మో అనుకునేవారు. ఇప్పుడు ఔటర్ దాటి పది కిలోమీటర్ల వరకూ ఇళ్ల ప్రాజెక్టులు వస్తున్నాయి. పదేళ్లలో అంత మారిపోయింది. వచ్చే పదేళ్లలో ఎంత మారిపోతుందో అంచనా వేయడం కష్టం. ఈ రియల్ ఎస్టేట్ వృద్ధిని అంచనా వేసి సరైన పెట్టుబడులు పెడితే ఊహించనంత లాభాలు వస్తాయి.
ఇప్పుడు దీర్ఘ కాల పెట్టుబడికి ఎక్కువ మంది షాద్ నగర్ వైపు చూస్తున్నారు. బెంగళూరు హైవేలో శంషాబాద్ దాటిన తర్వాత ఉండే షాద్ నగర్.. దాదాపుగా హైదరాబాద్లో కలసిపోతోంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో భాగమయింది. ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటమే కాదు.. పారిశ్రామికంగా కూడా ఎంతో మెరుగ్గా ముందుకెళ్తోంది. అనేక రకాల ప్రాజెక్టులు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా చాలా దగ్గర.
అందుకే షాద్ నగర్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఘనంగా జరుగుతోంది. రోజూ సిటీకీ వచ్చి పోయే అవసరం లేకపోతే… నివాసం ఉండటానికి కూడా అనుకూలంగా హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎక్కువ మంది చూపు షాద్ నగర్ వైపు ఉండటంతో అన్ని అనుమతులతో చాలా మంది ఫామ్ ప్లాట్లు.. విల్లా ప్లాట్లు అమ్ముతున్నారు.
ప్రస్తుతం విల్లా ప్లాట్లు దూరాన్ని, విస్తీర్ణాన్ని బట్టి పది లక్షల నుంచి ఎనభై లక్షల వరకూ పలుకుతున్నాయి. అన్ని వివరాలు పరిశీలించి మంచి ప్లాట్ ను కొనుగోలు చేసి పెట్టుకుంటే… రాబోయే రోజుల్లో ఊహించనంత సంపద చేరే అవకాశం ఉందని రియల్ నిపుణుల అంచనా.