వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కర్ణాటక కాంగ్రెస్ లీడర్ డీకే శివకుమార్ ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు అభినందించారు. అ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. వెంటనే.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం చేస్తారని గుసగుసలు ప్రారంభమయ్యాయి. వెంటనే షర్మిల ప్రెస్ మీట్ నేనేంటి.. నా పార్టీ ఎంటి.. వేరే పార్టీల్లో విలీనం కావడం ఏంటి అన్నట్లుగా స్పందించారు. అయితే తనకు మిస్డ్ కాల్స్ వస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంటే మంచి ఆఫర్ అయితే ఓకే అన్నట్లుగా ఆమె సంకేతాలిస్తున్నారు.
వైఎస్ఆర్ టీపీ పార్టీకి తెలంగాణలో రెండు, మూడు శాతం అయినా ఓటు బ్యాంక్ ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. అసలు ఎవరూ ఆ పార్టీని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆ పార్టీకి లీడర్లు, క్యాడర్ అంటూ ఎవరూ లేరు. ఉన్నది ఒక్క షర్మిలనే. పాలేరులో పెద్ద ఎత్తున తానే స్వచ్చందంగా కోట్లు ఖర్చు పెట్టి పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నప్పటికీ..త డిపాజిట్ వస్తుందో లేదో చెప్పడం కష్టం. ఆ విషయం ఆమెకు క్లారిటీ వచ్చిందేమో కానీ.. విలీనం అంశాలను తెరపైకి తెస్తున్నారు.
సీఎం జగన్ ఆస్తులు పంచివ్వకపోవడానికి తోడు.. పార్టీ నడపడానికి నిధుల సాయం ఎవైరనా చేస్తామన్నా జగన్ అడ్డుకుంటున్నారన్న అభిప్రాయంలో షర్మిల ఉన్నారు. ఆర్థిక పరమైన సమస్యలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. ఆ మధ్య మేఘాపై చాలా పోరాంట చేశారు కానీ.. పెద్దగా పార్టీ ఫండ్స్ వచ్చాయో లేదో తెలియదు. ఇప్పుడు పార్టీని తెలంగాణలో నడపడం భారంగా భావిస్తున్నారని అందుకే తనంతట తాను.. ఈ విలీనం వార్తలు తెరపైకి తెచ్చారన్న పుకార్లు తెలంగాణలో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తున్నాయని షర్మిల భావిస్తున్నారని.. ఇప్పుడు కాకపోతే రేపైనా తెలంగాణ కాకపోతే ఏపీలో అయినా లీడర్ కావొచ్చని ఆశపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.