వైసీపీ, జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. నేను చెప్పినట్లే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకున్నట్లుంది, మీరు అద్దంలో చూసుకున్నా చంద్రబాబే కనిపిస్తున్నట్లు ఉన్నారు అంటూ మండిపడ్డారు.
తాను ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే… చంద్రబాబు ఏజెంట్ అని మాట్లాడటంపై షర్మిల తీవ్రంగా స్పందించారు.
అసెంబ్లీకి జగన్ వెళ్లకపోవటం తప్పు… తప్పు కాబట్టే ప్రశ్నించాం… ఓ ప్రతిపక్ష పార్టీని, మరో ప్రతిపక్ష పార్టీ విమర్శించకూడదని ఎక్కడైనా ఉందా అని షర్మిల ప్రశ్నించారు. చట్టసభను గౌరవించని జగన్ ను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తన్నట్లు తెలిపారు.
Also Read : జగన్ జైలుకు వెళ్లకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు!
మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుంటే ఇప్పుడు వైఎస్ విగ్రహాలను కూల్చేవారా…? వైఎస్ విగ్రహాలను కూల్చితే తానే వచ్చి ధర్నా చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసిన షర్మిల, మీరు కనీసం స్పందించలేదని మండిపడ్డారు.
వైసీపీలో ఇప్పుడున్నది వైఎస్, విజయమ్మ కాదని… ఇప్పుడున్నది కేవలం వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణరెడ్డి మాత్రమేనన్నారు. వైఎస్సార్ లాగా మీకు అసెంబ్లీలో పోరాడటం చేతకాదులే… మీకు మీడియా పాయింటే ఎక్కువ అని షర్మిల ఎద్దేవా చేశారు.
మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టుపెట్టారని అన్నారు. మీ అహంకారమే మీ పతనానికి కారణమని మండిపడ్డారు.