ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ వ్యయమెంతో ఇప్పటికిప్పుడే చెప్పలేమని ‘స్విస్ ఛాలెంజ్’ విధానంలో అంతర్జాతీయ స్ధాయి బిల్డర్లు వేసే టెండర్లను బట్టి ఆమొత్తం లెక్కతేలుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
రాజధాని నిర్మాణానికి సంబంధించి మూడవ చివరి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాజమండ్రిలో ఈ రోజు ముఖ్యమంత్రికి అందజేశారు. ప్లాన్ లోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.
“నిధులు పెద్దసమస్య కాదు. మోటివేషన్, వర్క్ కల్చర్, పాజిటివ్ ఆలోచన ముఖ్యం. రాజధాని నిర్మాణంలో సింగపూర్ మన లాంగ్ టెర్మ్ పార్టనర్ గా వుండాలని కోరుతున్నాను. వారితో బిజినెస్ కన్సార్టియంద్వారా జపాన్ కూడా ఈ నిర్మాణంలో వుండాలని కోరినపుడు ఆదేశం ప్రతినిధులు సానుకూలం గా స్పందించారు. ఈ రెండుదేశాలూ కలిసి పనిచేస్తే ప్రపంచంలో నాణ్యతని వారే తీసుకువస్తారు. కేంద్రం నుంచి సాయం, రాష్ట్రం నిధులు, రుణాలతో రాజధానిని నిర్మించుకుందాం” అన్నారు.
సీడ్ కేపిటల్ ఏరియాను సుమారుగా 3 లక్షలమంది నివాసం ఉండేలా రూపొందించారని, బిజినెస్ హబ్ గా రూపొందే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలతో సహా వివిధ రంగాలలో దాదాపు 7 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని అంచనా వేశారని ముఖ్యమంత్రి వివరించారు.
స్విస్ ఛాలెంజింగ్ అంటే ఏమిటి ఇక్కడ క్లిక్ చేయండి http://www.telugu360.com/te/amaravathi-imaginary-pictures-released/
ఆమరావతి మాస్టర్ ప్లాన్ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి http://www.telugu360.com/te/andhra-pradeshs-new-capital-amaravathi-highlights/