అమెరికాలో భారతీయులపై జాత్యహంకార దాడులు కొత్త రూపు సంతరించుకున్నాయా? అంటే అవుననే అనిపిస్తోది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత నలుగురు భారతీయులు అమెరికన్ల దాడుల్లో బలయ్యారు. వీరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం జరిగిన దాడిలో ప్రముఖ గాయని శ్రీపాద చిన్నయి వస్తువులను పోగొట్టుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఓ సంగీత కార్యక్రమానికి ఆమె వెళ్ళారు. ఈ సందర్భంగా తన కారును పార్క్ చేసి, షాపింగ్కకు వెళ్ళారు. తిరిగొచ్చి చూసేసరికి కారు అద్దాలు పగిలిపోయి ఉండడాన్ని ఆమె గమనించారు. అందులో ఉన్న విలువైన వస్తువులూ కనిపించలేదు. ఒక్కసారిగా దిమ్మెరపోయిన ఆమె కొద్ది నిముషాల పాటు తేరుకోలేకోయారు. ఈ విషయాన్ని చిన్మయి తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఫిర్యాదు చేయబోతే పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోలేదని కూడా ఆమె ట్వీట్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ సాధారణమేనని పోలీసులు బదులిచ్చారని కూడా ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. దోపిడీ వ్యవహారం మొత్తం అక్కడి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలలో నమోదైంది. ఓ యువతి ఈ పనికి పాల్పడినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారన్నారు. ఇంత చెప్పిన పోలీసులు దాన్ని తీవ్రంగా పరిగణించలేమనడాన్ని ఏమనాలి. భారతీయుల పట్ల వివక్ష చూపడం కాదా. ఏదైనా చర్య తీసుకుంటే ట్రంప్ విధానాలను కాలరాచినట్లవుతుందనుకున్నారా? ఇదే సంఘటనలో అమెరికన్ నష్టపోతే కూడా పోలీసులు ఇలాగే ఉదాశీనంగా వ్యవహరించగలరా? ఇటువంటి వ్యవహార శైలి అమెరికాలోని విదేశీయుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ సంఘటనలో నష్టపోయిన శ్రీపాద చిన్మయి డబ్బింగ్ కళాకారిణి కూడా. ఆమె ఓ అనువాద సంస్థను కూడా నిర్వహిస్తున్నారు.
https://twitter.com/Chinmayi/status/861852030809251840
https://twitter.com/Chinmayi/status/861852232710447104
https://twitter.com/Chinmayi/status/861853194560733184
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి