విశాఖను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్రంలో చర్చ జరుగుతోందని కూడా చెబుతున్నారు. విశాఖ రక్షణ పరంగా అత్యంత కీలకమైనదని.. ఇక్కడ ఉండే ప్రాంతీయ ప్రభుత్వాలు.. రాజకీయ అవసరాల కోసం తీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఈ కారణంగా కేంద్ర పాలిత ప్రాంతం చేయవచ్చునని లాజిక్ చెబుతున్నారు. అంతర్గతంగా కేంద్రంలో ఈ చర్చ జరుగుతుందో లేదో కానీ.. బయట మాత్రం ఓ పానిక్ సృష్టించడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు.
విశాఖను ఏపీ సర్కార్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకుంటోంది. ఇలాంటి సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం అనే ప్రచారం ఎందుకు వచ్చిందో కానీ.. హాట్ టాపిక్ అవుతోంది. కాకినాడును ఆనుకుని ఉండే యానాం.. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగం. పుదుచ్చేరిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచడానికి కారణాలు ఉన్నాయి. కానీ విశాఖను అలా చేయడానికి ఒక్క కారణం కూడా కనిపించదు. రక్షణ పరంగా కీలకమైన నగరాలు ఎన్నో ఉంటాయి. వాటిన్నింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయలేరు. విశాఖ కూడా అంతే.
అయితే బీజేపీపై వ్యతిరేకతతోనే.. మరో కారణంగానో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు. విశాఖను కేంద్ర పాలిత ప్రాంతం చేసే చాన్స్ ఒక్క శాతం కూడా ఉండదని భావిస్తున్నారు. అలా చేస్తే ఏపీ మరింత కుదేలయిపోతుంది. ఆర్థిక వాహకంగా విశాఖ ఉంది. ఈ అంశంపై కేంద్రం స్పందించినా.. స్పందించకపోయినా ఇబ్బందే. ఏదోఓ ఊహాగానం చేస్తూ ఉంటారు.