ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై సోషల్ మీడియా జాతీయ స్థాయిలో భగ్గుమంటోంది. కనీస నైతిక విలువలు పాటించని … అత్యంత దుర్భరమైన మానసిక స్థితికి పోలీసులు వెళ్లిపోయారని మండి పడుతున్నారు. దీనికి కారణం ఓ పెట్టీ సోషల్ మీడియా కేసు పేరుతో అంజన్ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకుని .. చివరికి అతన్ని కోర్టులో ప్రవేశ పెట్టి అతను స్వలింగ సంపర్కుడంటూ అవసరం లేకపోయినా రిపోర్టులో రాసి.. మీడియాకు ఇంకా ఘోరంగా వివరాలు చెప్పడమే.
అంజన్ అనే వ్యక్తిని ఏ కేసులో అరెస్టు చేశారు ? ఎలాంటి అరోపణలు చేశారు ?
అసలు అంజన్ స్వలింగ సంపర్కుడో కాదో చెప్పడానికి పోలీసులు ఎవరు ? వారెమైనా టెస్టులు చేశారా? అసలు అర్థరాత్రి పూట ఇంట్లోకి చొరబడి అంజన్ను తీసుకెళ్లిన కేసేమిటి ? వారు చెబుతున్న వివరాలేమిటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా పోలీసులు తమ విచక్షణ మరిచిపోయి.. చేస్తున్న వ్యవహారమని అంటున్నారు. కృష్ణా జిల్లా పోలీసులకు నెటిజన్లు రెండే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒకటి అంజన్ను ఏ కేసులో అరెస్టు చేశారు ?. రెండు అతని సెక్సువారిటీ గురించి ఎందుకు బయట పెట్టారు ?
ఐపీఎస్ ఆఫీసర్లకు కనీస నైతిక విలువల ప్రవర్తన కూడా తెలియదా ?
పోలీసులు చెప్పారంటూ సాక్షి పత్రికలో ఇంకా ఎక్కువ రాశారు. చివరికి అంజన్ తల్లిదండ్రుల మీద కూడా నిందలు వేశారు. ఏపీ పోలీసుల తీరు మానవహక్కులను పూర్తిగా ఉల్లంఘించేది ఉందని.. ఇది తీవ్రమైన తప్పిదమన్న ఆరోపణలు ఉన్నాయి. అంజన్ అనే వ్యక్తి నిజంగా ఎల్జీబీటీనా కాదా అన్నది ఎవరికీ తెలియదు. అతని ఫోన్లు స్వాధీనం చేసుకుని ఆ ఫోన్లలో ఆ వీడియోలు ఉన్నాయని.. బయట పెట్టారు. వాటిని పోలీసులే ఎక్కంచి ఉండరన్న నమ్మకం ఏముందన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పోలీసులు పూర్తి స్థాయిలో దారి తప్పిపోయారని ఇంత కంటే దారుణమైన పోలీసింగ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదని.. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని మానవ హక్కుల పట్ల కనీస బాధ్యత చూపకుండా విధులు నిర్వహించి ఇలా వ్యక్తుల్ని నీచ స్థాయిలో టార్గెట్ చేయడం క్షమించరాని నేరమని అంటున్నారు.
రేపు ప్రభుత్వం మారితే ఈ ఆఫీసర్లపైనే ఇదే ప్రచారం చేస్తే డిఫెండ్ చేసుకోగలరా ?
అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ పోలీసులు పూర్తి స్థాయిలో దిగజారిపోయారు. తప్పుడు కేసులతో ఎంత మందిని వేధించారో లెక్కే లేదు. ఇప్పుడు వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రే్పు ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ప్రతీకారచర్యలు తీసుకుంటారు. అప్పుడు ఈ పోలీసులపైనే ఇలాంటి ప్రచారాలు వాళ్లు చేసినా తప్పు అనే చెప్పుకునే పరిస్థితి ఉండదని కొంత మంది నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కారణం ఏదైనా ఏపీ పోలీసుల ఇమేజ్ మరో మెట్టు దిగజారిపోయింది.