ఏపీ బీజేపీలో సోము వీర్రాజును చూసి నేతలంతా.. ఇలా ఎలా ఉండగలుగుతారు గురూ అనుకుంటున్నారు. ఆయన చెప్పిన మాట వినరు. ఆయనకు ఏమీ తెలియదు.కానీ తానే మోనార్క్ అనుకుంటూ ఉంటారు. ఆయన తీరుతో.. అనుచరులుగా ఉన్న వారంతా దూరమైపోయారు. ఆయన ఒక్కరే.. ఇప్పుడు.. ఆయన వెంట ఎవరూ లేరు. అయినా సోము వీర్రాజు మాత్రం తగ్గడం లేదు.
అసలు మీడియా, సోషల్ మీడియాలో వచ్చే వాటిని నిజాలు నిర్ధారించుకోకుండా ఏ పార్టీ నేత కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయరు. కానీ సోము వీర్రాజు ఆ పని చేస్తారు. విష్ణుకుమార్ రాజుతో పాటు.. టీజీ వెంకేటష్ కూ ఆయన నోటీసులు ఇచ్చారు. నిజానికి సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావొచ్చు కానీ ఆయనకు వార్డు మెంబర్ గా గెలిచిన రికార్డు కూడా లేదు. టీడీపీ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఇస్తే.. పదవి అనుభవించారు. అయితే తన కంటే తోపు లేడన్నట్లుగా ఆయన తీరు బీజేపీలో ఉంటోంది.
వైసీపీకి దగ్గరగా ఉండే నేతల్ని ఆయన ఏమీ అనరు. కానీ టీడీపీతో దగ్గర అని అనిపించిన వారు ఏం చేసినా వారిపై విరుచుకుపడుతున్నారు. పదవి చేపట్టిన మొదట్లో ఆదే చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. సోము వీర్రాజు పదవి చేపట్టిన కొత్తలో ఆయనకు కొంత మంది యువనేతల మద్దతు లభించేది. తన ఈగోతో.. సోము వీర్రాజు వారిని కూడా దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన తీరుపై అందరూ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఏపీలో పార్టీ ఉందా లేదా అనే దాని గురించే మర్చిపోయిన బీజేపీ హైకమాండ్.. అసలు పట్టించుకోవడం మానేసింది.