కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి సంపాదించిన నమ్మకానికి సోనియా ఏకంగా తెలంగాణలో పోటీకి నిర్ణయం తీసుకోవడమే సాక్ష్యంగా కనిపిస్తోంది.. ఈ సారి సోనియా దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆరోగ్యం ఇతర కారణాల రీత్యా ఆమె ఎక్కువగా పర్యటించలేరు. అందుకే సులువుగా ఉన్న లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు . పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు రాగానే వెంటనే… తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఎక్కడ పోటీ చేస్తే మంచి మెజార్టీ వస్తుందో లెక్కలేసి.. నివేదిక కూడా సమర్పించారు.
అన్నీ ఆలోచించిన హైకమాండ్ ఖమ్మం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మెదక్, మల్కాజిగిరి స్థానాలపై పరిశీలన జరిపినా… మరీ అంత ఏకపక్షంగా ఉండే అవకాశం లేదని.. కానీ ఖమ్మం మాత్రం ఏకపక్షంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోయింది. పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరవుపార్టీని వీడటంతో క్యాడర్ అంతా వారితో వెళ్లిపోయింది. సిట్టింగ్ ఎంపీ నామా ఉన్నా ఆయన తో పెద్దగా క్యాడర్ లేదు. మంత్రిగా చేసిన పువ్వడ అజయ్ ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ అయ్యారు. అందుకే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి యాభై వేల వరకూ మెజార్టీ వచ్చింది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని సోనియా గాంధీ పోటీ చేస్తే మరింత మెజార్టీ వస్తుందన్న భావనతో ఖమ్మం నుంచి సోనియా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికిఈ సమాచారం అందడంతో ఆయన ఖమ్మం విషయంలో ప్రత్యేకదృష్టి పెట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం ఎన్నిక బాధ్యతను తీసుకునే అవకాశం ఉంది.