సాయిధరమ్ తేజ్ – సంపత్ నంది కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుగు 360 ముందే చెప్పింది. అదే నిజమైంది కూడా. జులైలో చిత్రీకరణ మొదలు కానుంది. ఈలోగా కథానాయిక వేట మొదలెట్టింది చిత్ర బృందం. సంపత్ నంది సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కువగా స్టార్ హీరోయిన్లకే ఆయన తన సినిమాల్లో చోటిస్తుంటారు. ఈసారీ అదే ఫార్ములా పాటిస్తున్నారు. గాంజా శంకర్‌కి తోడుగా శ్రీలీల లేదంటే పూజా హెగ్డే కనిపించే అవకాశం ఉంది. వీరిద్దరికీ కథ చెప్పేశారు. ఫైనల్ కాల్ తీసుకోవాల్సివుంది. ఇద్దరి డేట్లలో ఎవరివి సర్దుబాటు అయితే.. వాళ్లే గాంజా శంకర్ తో జోడీ కడతారు. అయితే శ్రీలీల, పూజా ఇద్దరూ ఫుల్ బిజీనే. శ్రీలీలతో పోలిస్తే పూజా డేట్లే కాస్త అందుబాటులో ఉంటాయేమో..? మరి వీరిద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ఇటీవల `విరూపాక్ష`తో ఓ సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు తేజ్. అది థ్రిల్లర్ చిత్రం. `గాంజా శంకర్` మాత్రం… పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా. కమర్షియల్ కథలు తెరకెక్కించడంలో సంపత్ నంది సిద్ధహస్తుడే. అందుకే ఈ కాంబోపై క్రేజ్ పెరిగింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.