‘పెరుగుట విరుగుట కొరకు’ అని తెలుగులో ఒక సామెత. బహుశా… శ్రీరెడ్డిలోని నటనా ప్రతిభ విపరీతంగా పెరిగినట్టుంది. సినిమాల్లోకి వచ్చేసరికి అది ఎక్కడ విరుగుతుందోనని ఇన్నాళ్లూ దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వలేదనుకుంట. సోషల్ మీడియాలో ఆమె సిత్రాలు చూస్తే ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. కొమ్ములు తిరిగిన శేఖరుడని ఫేస్బుక్లో ఆమె కామెంట్ చేసి, తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ఆయన ప్రగాఢ విశ్వాసమని ఆరోపించి మూడు రోజులు కూడా కాలేదు. ఈలోపు మాట మార్చేసింది. శ్రీరెడ్డి పోస్టులో ఎక్కడా శేఖర్ కమ్ముల పేరు లేకపోవచ్చు. కాని ఆమె మాటల్లో అర్థం, ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేసిందనే అంతరార్థం నెటిజన్లు అందరికీ అర్థమైంది.
శేఖర్ కమ్ములపై మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు వున్నాయా? అని ప్రశ్నించే సరికి నీళ్లు నములుతోంది. నోటికి జిప్ వేస్తూ ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. “శేఖర్ కమ్ముల అని నేను చెప్పనా? అసలు ఆయనెవరు?” అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. నాకు దమ్ముంది, ధైర్యం వుంది అంటూ బోల్డన్ని కబుర్లు చెప్పిన శ్రీరెడ్డియేనా ఇప్పుడు మాట్లాడుతోంది? అని విస్తుపోవడం ఫేస్బుక్ లైవ్లో ఆమె వీడియో చూస్తున్న ప్రేక్షకుల వంతు అయ్యింది. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అన్నట్టు ముందు కామెంట్ చేయడం ఎందుకో.. తరవాత కాదు కాదు అనడం ఎందుకో?
శేఖర్ కమ్ముల వివాదం వదిలేస్తే… ఇంకో అద్భుతమైన మాట శ్రీరెడ్డి నోటి నుంచి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ బయోపిక్ కోసం హోమ్ వర్క్ చేస్తున్నారట. నేను తీయబోయే రెండు సినిమాల్లో ఈమెకు అవకాశం ఇస్తున్నట్టు దర్శకుడు తేజ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఆయన ఏ పాత్ర ఇచ్చారో తెలియదు కాని క్యారెక్టర్ కోసం, అందులో బాగా నటించడం కోసం ఆమె హోమ్ వర్క్ స్టార్ట్ చేశారట.